Viral Video: కొత్త జంటకు ఊహించని బహుమతి.. ఒక్కసారిగా కెవ్వుమన్న పెళ్లి కూతురు

Viral Wedding Prank Video: పెళ్లంటే ఉత్సవాల హంగామా, సందడి, సరదాలు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో పెళ్లి వేడుకల్లో జరిగే సంఘటనలు ఇట్టే వైరల్ అవుతున్నాయి వధూవరులు ఒకరిపై ఒకరు సరదా ప్రాంక్‌లు చేయడం, స్నేహితులు వినూత్నంగా ఆటలతో ఆట పట్టించడం సహజం అయిపోయింది తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Update: 2025-05-14 14:38 GMT

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఒక వివాహ వేడుకలో వధూవరులు వేదికపై కూర్చొని ఉంటారు. బంధుమిత్రులు వచ్చి వారికి అభినందనలు తెలుపుతూ, వివిధ గిఫ్ట్‌లు ఇస్తూ ఫొటోలు దిగుతుంటారు. అదే సమయంలో కొత్త జంటకు ఓ ప్రత్యేక బహుమతి లభిస్తుంది. ఆ బాక్స్‌ను వరుడు ఆతురతగా ఓపెన్ చేస్తాడు.

గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులోంచి ఒక్కసారిగా ఓ కప్ప బయటకు జంప్ చేసి వధువు దిశగా దూకుతుంది. అది చూసిన వధువు ఒక్కసారిగా భయంతో కేకలతో వెనక్కి పరుగెత్తుతుంది. ఇదంతా అక్కడే ఉన్నవారు తమ స్మార్ట్ ఫోన్‌లో చిత్రీక‌రించ‌గా వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఫ‌న్నీగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం గిఫ్ట్ రా బాబోయ్!’’ అంటూ కొంద‌రు కామెంట్స్ చేయ‌గా మ‌రికొంద‌రు స్పందిస్తూ ఈ బ‌హుమ‌తిని పెళ్లి కూతురు జీవితంలో మ‌రిచిపోలదంటూ స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మ‌రెందుకు ఆల‌స్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

Tags:    

Similar News