Viral Video: పిచ్చి అంటారండి.. ఈ యువతి చేసిన పనికి ఫైర్ అవుతోన్న నెటిజన్లు
Viral Video: తాజాగా సోషల్ మీడియా వైరల్ అవుతోన్న ఓ వీడియో (Viral Video) చూస్తుంటే పిచ్చి పీక్స్‌కి చేరిందని అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి నిల్చుతుంది. అదే సమయంలో పాటకు స్టెప్పులు వేస్తోంది.
Viral Video: పిచ్చి అంటారండి.. ఈ యువతి చేసిన పనికి ఫైర్ అవుతోన్న నెటిజన్లు
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిందో ప్రతీ ఒక్కరూ పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. ఏదైనా చేసి నెట్టింట వైరల్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కానీ వ్యూస్ రావాలని అనుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే పని చూస్తుంటే పిచ్చి వెయ్యి రకాలు అనే సామెత పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా సోషల్ మీడియా వైరల్ అవుతోన్న ఓ వీడియో (Viral Video) చూస్తుంటే పిచ్చి పీక్స్‌కి చేరిందని అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి నిల్చుతుంది. అదే సమయంలో పాటకు స్టెప్పులు వేస్తోంది. దీనంతటినీ కింద ఉన్న వారు స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో చేసే సమయంలో కరెంట్ కనెక్షన్ లేదన్న విషయం స్పష్టమవుతోంది.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ పొరపాటున కరెంట్ ఆన్ అయితే ఆ యువతి పరిస్థితి ఏంటంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం ఎంతకైనా దిగజారుతారా.? అంటూ కొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వీడియో పోలీసులు చూస్తే కచ్చితంగా చర్మలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఇలాంటి పనులు చేసే వారి విషయంలో పోలీసులు అస్సలు ఊపేక్షించరు. ఇటీవల రద్దీ రోడ్డుపై ఓ వ్యక్తి స్కూటీని రివర్స్ నడిపిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లగా సదరు వ్యక్తి అరెస్ట్ చేసి జైల్లో వేశారు.