Viral Video: ఎయిర్ పోర్ట్ లో మహిళ రాద్ధాంతం.. నేలపై కూర్చొని నానా హంగామా
Viral video: ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్‌పోర్టులో ఓ మహిళ చేసిన హంగామా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఎయిర్ పోర్ట్ లో మహిళ రాద్ధాంతం.. నేలపై కూర్చొని నానా హంగామా
Viral video: ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్‌పోర్టులో ఓ మహిళ చేసిన హంగామా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఘటన ప్రయాణికుల భద్రత, నిబంధనలపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది.
సమాచారం ప్రకారం, సదరు మహిళ చేతిలో తీసుకెళ్లే లగేజీ బరువు అనుమతించిన పరిమితిని మించిందని అధికారులు గుర్తించారు. దీంతో అదనపు బరువు కోసం ఛార్జీలు చెల్లించాల్సిందిగా చెప్పారు. లేదా అదనపు సామాను చెక్-ఇన్ బ్యాగ్‌కి మార్చుకోవాలన్నారు. కానీ ఈ సూచనలను ఆమె తిరస్కరించింది. హ్యాండ్ లగేజీ మొత్తం తనతో తీసుకెళ్తానని అద్భుతంగా వాదించింది.
ఈ తర్జన భర్జన మధ్య ఆమె ఒక్కసారిగా భూమిపై కూర్చుని, చేతులు కాళ్లతో నేల కొడుతూ హంగామా మొదలుపెట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాధానంగా అశాంతిని నివారించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను సంబంధిత విమానంలోకి అనుమతించలేదు. ఆ తర్వాత ఆమె శాంతించాక మరో విమానానికి టికెట్ బుక్ చేసి పంపించారు.
ఈ ఘటనపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “ఇలా నేలపై కూచొని గోల చేస్తే ఏమైనా సాధ్యమవుతుందా?” అంటూ కొందరు విమర్శించగా, “విమానయాన నిబంధనలు అందరికీ సమానమే, అందులో ఎలాంటి మినహాయింపు ఉండదు” అని మరికొందరు తెలిపారు. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క నెల క్రితమే అమెరికాలోని చికాగో ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు కంప్యూటర్ మానిటర్‌ను సిబ్బందిపై విసిరిన ఘటనను కొందరు గుర్తు చేశారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.