Viral Video: గేదెపై నిలబడి డ్యాన్స్‌.. ఆగని రీల్స్ పిచ్చి.. చివరికి నెటిజన్ల ఆగ్రహం

సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా రీల్స్‌లో మునిగిపోతున్నారు.

Update: 2025-08-17 14:00 GMT

Viral Video: గేదెపై నిలబడి డ్యాన్స్‌.. ఆగని రీల్స్ పిచ్చి.. చివరికి నెటిజన్ల ఆగ్రహం

సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా రీల్స్‌లో మునిగిపోతున్నారు. వ్యూస్‌ కోసం, లైకుల కోసం ఏకంగా ఎలాంటి సాహసాలకైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన విచిత్ర రీల్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటి ముందర కట్టేసిన గేదెపైకి ఎక్కి ఆ మహిళ నిలబడి డ్యాన్స్ చేసింది. కెమెరాకు ఫోజులు ఇస్తూ, ఎటూ అటూ కదులుతూ చాలా సేపు గేదెపై నిలబడి డ్యాన్స్ చేసింది. పక్కన ఉన్న వారు గేదె కదలకుండా పట్టుకున్నారు. ఆ సమయంలో ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా, చుట్టుపక్కల వారు కూడా హర్షం వ్యక్తం చేశారు.

అయితే గేదె ఒక్కసారిగా పరుగులు తీసి ఉంటే.. ఆ మహిళకు ప్రాణాపాయం తప్పేదే కాదు అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం రీల్స్ కోసం ఇలా జంతువులను ఇబ్బంది పెట్టడం తప్పని, ఈ పిచ్చి చివరికి ప్రమాదకరమని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Tags:    

Similar News