Viral Video: బామ్మకు పెట్టకుండా తింటే ఊరుకుంటానా..యజమాని తలపై కొట్టిన పెంపుడు కుక్క.. వైరల్ వీడియో
Viral Video: సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కుక్క చేసిన పనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపడటమే కాదు పెద్ద వాళ్ల గురించి ఇప్పుడు మనుషులే ఆలోచించడం లేదు.. కుక్క ఆలోచించడం భలే ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

ఒక యజమాని వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి యాపిల్ ముక్కలను తినిపించడానికి సోఫాలో కూర్చుని ఉన్న తల్లి దగ్గర వెళ్లి కూర్చుంటాడు. అదే సమయంలో వాళ్ల పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ కూడా సోఫాలో ఆ బామ్మ పక్కనే కూర్చుని ఉంటుంది. అయితే యజమాని ఏం చేస్తాడంటే ఒక యాపిల్ ముక్కను మొదట కుక్క నోట్లో పెట్టడానికి చూస్తాడు. కానీ విచిత్రంగా ఆ కుక్క నాకొద్దు బామ్మకు పెట్టమని చూపిస్తుంది. ఒకే అంటూ యజమాని ఒక ముక్కను తీసి బామ్మకు పెడతానని ఆమె నోరు వరకు తీసుకెళతాడు. కానీ వెంటనే దాన్ని తన నోటిలో వేసుకుంటాడు. ఇంకేం ముందు ఆ కుక్క వెంటనే బామ్మకు పెట్టకుండా నువ్వు తింటావా అన్నట్టు అతని తలపై దబదబా విమానం మోత మోయించేస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిధా అయిపోతున్నారు. బామ్మలను ఈ జనరేషన్‌లో ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. కానీ కుక్క ఆమె అంటే ఎంత విశ్వాసమో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసానికి మారు పేరు అని విన్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం. తనకు కూడా వద్దని బామ్మకు పెట్టమని పైగా ఆ బామ్మను టచ్ చేసి యజమానికి చూపించడం రియల్లీ అద్బుతమైన ఫీలింగ్. అందుకే నెటిజన్లు ఈవీడియోని చూసి శభాష్ రిట్రీవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే కదా ఉంటే అలాంటి కుక్కే ఒకటి ఉండాలి.