Viral Video: లండ‌న్ కంటే ఢిల్లీ మెట్రో సూప‌ర్‌.. వైర‌ల్ అవుతోన్న టూరిస్ట్ వీడియో

Viral Video: దేశంలో మెట్రో సేవ‌లు వేగంగా విస్త‌రిస్తున్నాయి. ఇత‌ర దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలో మెట్రో ఆల‌స్యంగా అందుబాటులోకి వ‌చ్చినా అభివృద్ధి మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Update: 2025-06-16 10:45 GMT

ఒక బ్రిటన్‌కు చెందిన పర్యాటకుడు ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌ను సందర్శించగా, అది అనుకోకుండా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఓ మెట్రో స్టేషన్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయ‌గా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అయిన అలెక్స్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించిన వెంట‌నే వావ్ అంటూ వీడియోను మొదలు పెట్టారు. ఆ వీడియోలో మెట్రో స్టేషన్ ఎంత శుభ్రంగా ఉందో, మంచి నిర్వహణ ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోతో పాటు టూరిస్ట్‌.. లండ‌న్ అండ‌ర్ గ్రౌండ్ కంటే ఢిల్లీ మెట్రో బాగుంది అని రాసుకొచ్చారు.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లండ‌న్ కంటే ఇండియా మెట్రో బాగుంద‌ని చెప్ప‌డం ఎంతో గ‌ర్వంగా ఉందంటూ కొందరు కామెంట్ చేయ‌గా. మ‌రి కొంద‌రు స్పందిస్తూ ఇప్పుడు భార‌త్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది అంటూ స్పందించారు. మ‌రెందుకు ఆల‌స్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Tags:    

Similar News