Viral Video: వావ్.. ఎంత ముద్దుగా ఉందో ఈ తాబేలు.. ఏం చూస్తుందో ఈ వీడియోలో చూడండి..!

Turtle Video: ఒక తాబేలు పండు కోసం ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంది.

Update: 2025-09-16 06:33 GMT

Viral Video: వావ్.. ఎంత ముద్దుగా ఉందో ఈ తాబేలు.. ఏం చూస్తుందో ఈ వీడియోలో చూడండి..!

Turtle Video: ఒక తాబేలు పండు కోసం ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంది.

వివరాల్లోకి వెళితే, ఒక తాబేళ్ల పార్కులో ఉన్న మామిడి చెట్టు కింద తిరుగుతున్న ఒక తాబేలు పైన ఉన్న మామిడి కాయను గమనించింది. అది ఆ కాయను తినాలని ఆశపడింది. అందుకోసం అది తన మెడను వీలైనంత వరకు పైకి చాచింది. కానీ, అదే సమయంలో గాలి బలంగా వీచడంతో మామిడికాయ ఊగడం మొదలుపెట్టింది.

తాబేలు ఎంత ప్రయత్నించినా, కాయ దాని నోటికి అందకుండా అటూ ఇటూ కదులుతూనే ఉంది. చాలా సేపు ఎదురు చూసి, నిరాశ చెందిన తాబేలు చివరికి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చాలామందిని ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News