Viral Video: లంబోర్గినీకి అడ్డుగోడగా వీధి కుక్క.. కుక్క దాదాగిరి నెటిజన్స్‌కి ఫిదా!

రోడ్డుపై వీధి కుక్కలు పాదచారులకు, వాహనదారులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేస్తూ ఇబ్బందులు కలిగిస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

Update: 2025-07-16 16:29 GMT

Viral Video: లంబోర్గినీకి అడ్డుగోడగా వీధి కుక్క.. కుక్క దాదాగిరి నెటిజన్స్‌కి ఫిదా!

రోడ్డుపై వీధి కుక్కలు పాదచారులకు, వాహనదారులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేస్తూ ఇబ్బందులు కలిగిస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్స్‌కి వినోదాన్ని పంచుతోంది. లంబోర్గినీ కార్ ముందు ఓ వీధి కుక్క అడ్డుగా నిలబడి దాన్ని వెళ్లనివ్వకపోవడం ఆ వీడియో స్పెషల్.

ముంబైలోని వత్సలబాయి దేశాయ్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఒక నారింజ రంగు లంబోర్గినీ పక్క లేన్‌ నుండి బయటకు రాబోతుండగా, అకస్మాత్తుగా ఓ వీధి కుక్క దాని ముందు నిలబడి కదలకుండా నిలిచి పోయింది. డ్రైవర్ హారన్ మోగిస్తూ కుక్కను తప్పించుకోవాలని ప్రయత్నించినా, కుక్క ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. "ఈరోజు ఈ కార్‌ని వదలకూడదనుకున్నట్లుంది" అని చూసినవారంతా అనుకున్నారు.

కుక్క దాదాగిరిని చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. చివరకు లంబోర్గినీ డ్రైవర్ ఎలాగోలా కారు తీసుకెళ్లగలిగాడు. అయితే కుక్క మాత్రం అంతటితో ఆగిపోలేదు, కారు వెనకాలే పరుగెత్తింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సరదాగా "టామీకి సీన్ అర్థమైందనుకుంటా.. షెరు హై అపున్!" అని రాశారు. మరొకరు, "ఇది అసలు బెదిరింపే!" అని కామెంట్ చేశారు. ఇంకొకరు, "డోగేష్ భాయ్‌తో గొడవ పడకండి" అంటూ ఫన్నీగా స్పందించారు.

ఈ వీధి కుక్క ‘బాస్‌ అటిట్యూడ్‌’తో నెటిజన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది.



Tags:    

Similar News