Viral Video: డెలివరీ బాయ్ చేసిన పనికి మండిపడుతోన్న నెటిజన్లు.. కస్టమర్లకు ఇవ్వాల్సిన ఫుడ్‌ను
Viral Video: ప్రస్తుతం దేశంలో ఫుడ్ డెలివరీ సేవలు భారీగా పెరిగాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ చేస్తున్న పనులు చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది.
Viral Video: డెలివరీ బాయ్ చేసిన పనికి మండిపడుతోన్న నెటిజన్లు.. కస్టమర్లకు ఇవ్వాల్సిన ఫుడ్‌ను
Viral Video: ప్రస్తుతం దేశంలో ఫుడ్ డెలివరీ సేవలు భారీగా పెరిగాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ చేస్తున్న పనులు చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. తాజాగా ఇలాంటి ఓ విస్తుపోయే సంఘటన జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెలితే.. ఒక అపార్ట్‌మెంట్ ఎలివేటర్‌లోకి ప్రవేశించిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్, కొన్ని ఫ్లోర్ల బటన్లను నొక్కిన తర్వాత, ఎలివేటర్ ఆగగానే డెలివరీ చేసిన ఆర్డర్‌ను ఓపెన్ చేసి అందులోని కొంత ఆహారాన్ని తిన్నాడు. మళ్లీ అదే ప్యాకింగ్ లో ఆహారాన్ని పెట్టి తాపీగా డెలివరీకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో, ప్రజల్లో కలకలం రేపుతోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం.. "ఒక మనిషి ఆకలితో ఇలాంటి చర్యకు పాల్పడితే, దానికి కారణం వ్యక్తిగతమేనా..? లేక వ్యవస్థలో లోపమా?" అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అంటున్నారు.
ఈ సంఘటన నైతికత, ఆర్థిక అసమానతలు, ఉద్యోగ గౌరవం వంటి అంశాలపై మళ్లీ చర్చకు తావిస్తుంది. రోజుకు కేవలం 10–15 డెలివరీలే చేయగలిగే వారు, తక్కువ వేతనాల్లో జీవించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తగిన జీతాలు చెల్లిస్తున్నాయా? ఆకలి కారణంగా ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తే, అది ఎవరి బాధ్యత? దీనికి సమాజం బాధ్యత వహించదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.