Viral Video: ఆకాశంలో అద్భుతం.. మేఘాలు సముద్రపు నీటిని ఎలా తాగేస్తున్నాయో చూశారా?
Viral Video: ఎక్కడ, ఏ వింత జరిగినా సరే నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లు ఆకర్షిస్తోంది.
Viral Video: ఆకాశంలో అద్భుతం.. మేఘాలు సముద్రపు నీటిని ఎలా తాగేస్తున్నాయో చూశారా?
Rare Water Spout Captured Clouds
Viral Video: ఎక్కడ, ఏ వింత జరిగినా సరే నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లు ఆకర్షిస్తోంది. సముద్రం మీదుగా మేఘాలు నీటిని తీసుకుంటున్నట్లుగా కనిపించే ఒక అపురూపమైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆకాశం నుంచి భూమికి పైప్‌లైన్ వేసినట్టు, నీలి సముద్రాన్ని తాకుతూ, ఆకాశంలో పొడవుగా వెళ్లే మేఘాల తాళాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
ఈ వీడియోను harbhajan0.1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా, ఇది చాలా తక్కువ సమయంలోనే లక్షల వ్యూస్‌తో వైరల్ అయింది. వీడియోలో ఒక వ్యక్తి ఆ దృశ్యాన్ని కుడా ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నాడు. ఎంతోమంది ఈ దృశ్యాన్ని 'భూమి-ఆకాశం కలయిక'గా, మరికొందరు 'ప్రకృతి పైప్‌లైన్'గా అభివర్ణిస్తున్నారు. కొందరు ఈ వీడియోను ఏఐ సహాయంతో రూపొందించారని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సహజంగా జరిగే ప్రక్రియే. శాస్త్రీయంగా దీన్ని వాటర్ స్పౌట్ అంటారు. ఇది సముద్రంపై ఏర్పడే ఒక రకమైన సుడిగుండం. తుఫాను మేఘం సముద్రపు నీటిని ఆవిరి రూపంలో పైకి లాగుతుంది. ఫలితంగా, ఈ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ అద్భుతం ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు.. జీవితంలో ఒక్కసారైనా అద్భుతాన్ని చూడాలి అంటూ స్పందిస్తే. మరికొందరు.. "ఇది భయంకరమైన అందం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసేయండి మరి.