Viral Video: ప్రాణాలకు తెగించి మరీ రిపోర్టింగ్.. ఆ తర్వాత వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్
Viral Video: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వరదలు నగరాలను ముంచెత్తుతున్న వీడియోలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ కు చెందిన వీడియోలైతే తెగ వైరల్ అవుతున్నాయి.
Viral Video: ప్రాణాలకు తెగించి మరీ రిపోర్టింగ్.. ఆ తర్వాత వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్
Viral Video: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వరదలు నగరాలను ముంచెత్తుతున్న వీడియోలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ కు చెందిన వీడియోలైతే తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా రోడ్డుపైకి భారీ వరద రావడంతో , ఆ వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ జర్నలిస్ట్ తన డ్యూటీని మరిచిపోకుండా తాను ఆ వరద నీటిలో కొట్టుకుపోయేంత వరకు లైవ్ ఇస్తూనే ఉండాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జర్నలిస్టులు అంటేనే ధైర్యసాహసాలు ప్రదర్శించే వ్యక్తులు. ఈ మధ్యకాలంలో ఇలాంటివెన్నో సంఘటనలు జరిగాయి. ప్రాణాలకు తెగించి మరీ జర్నలిస్టులు వార్తలను కవర్ చేస్తున్నారు. అయితే తాజాగా పాక్‌లో వరదల్లో చిక్కుకున్న ఒక జర్నలిస్ట్ తన ప్రాణాలను లెక్క చేయకుండా వరదల గురించి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. అతని పీకల మీద వరకు వరద వచ్చినా పట్టించుకోకుండా లైవ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వరదల్లో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన రావల్పిండిలో జరిగింది.
అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొంతమంది జర్నలిస్ట్ నిర్లక్ష్యాన్ని తిడుతున్నారు. అంతటి ప్రమాదకరమై పరిస్థితుల్లోనూ లైవ్ ఇవ్వడం అవసరమా? తన ప్రాణాలను కాపాడుకోడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి కదా. అలా నిర్లక్షంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు.