Viral Video: రోడ్డుపై పరుగులు పెడుతోన్న మంచం.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: ప్రపంచంలో ట్యాలెంట్ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఈ ట్యాలెంట్ ప్రపంచానికి తెలియాలంటే ఎంతో సమయం పట్టేది.
Viral Video: రోడ్డుపై పరుగులు పెడుతోన్న మంచం.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: ప్రపంచంలో ట్యాలెంట్ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఈ ట్యాలెంట్ ప్రపంచానికి తెలియాలంటే ఎంతో సమయం పట్టేది. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి ట్యాలెంట్ ఉన్నా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
మార్కెట్లో రకరకాల వాహనాలు చూసి ఉంటాం. అయితే నడిచే మంచాన్ని ఎప్పుడైనా చూశారా.? మంచం ఏంటి.? నడవడం ఏంటి.? అని ఆలోచిస్తున్నారా.? ఓ యువకుడు తన ఆలోచనకు మెరుగులు దిద్దాడు. పాత కారుతో కదిలే మంచాన్ని తయారు చేశాడు. చక్రాలు, ఇంజిన్ వాడి, మిగతా అనవసర భాగాలను తొలగించాడు. ఆ బేస్‌పై సరిగ్గా బెడ్ అమర్చి, సౌకర్యంగా కూర్చునేందుకు మధ్యలో సీటు ఏర్పాటు చేశాడు.
ఇంకేముంది ఈ బెడ్ కారు ఎంచక్కా రోడ్లపై పరుగులు పెడుతోంది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. "ఇది వేరే లెవెల్ ఆవిష్కరణ!" అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరో యూజర్ స్పందిస్తూ నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.