Viral Video: పీట లేదు.. పలక లేదు.. ఏకంగా బొజ్జనే వాడేశాడు! ఇదెక్కడి టాలెంట్ సామీ?
Viral Video: నెటిజన్ల వినోదం కోసం కొందరు చేసే పనులు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే, మరికొన్ని సార్లు అవాక్కయ్యేలా చేస్తాయి.
Viral Video: పీట లేదు.. పలక లేదు.. ఏకంగా బొజ్జనే వాడేశాడు! ఇదెక్కడి టాలెంట్ సామీ?
Viral Video: నెటిజన్ల వినోదం కోసం కొందరు చేసే పనులు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే, మరికొన్ని సార్లు అవాక్కయ్యేలా చేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. సాధారణంగా పూరీలు చేయాలంటే పీట కావాలి, కానీ ఇక్కడొక వ్యక్తి తన శరీర భాగాన్నే పీటగా మార్చేశాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన వేలాడుతున్న పెద్ద పొట్టను (బొజ్జ) పూరీలు వత్తడానికి వేదికగా చేసుకున్నాడు. ఎవరైనా కిచెన్ ప్లాట్‌ఫామ్ మీదో లేదా పీట మీదో పూరీలు చేస్తారు. కానీ, ఈ వ్యక్తి తన బొజ్జపై పిండి ముద్దను ఉంచి, చపాతీ కర్రతో దాన్ని రుద్దుతూ పూరీ ఆకారంలోకి తెచ్చాడు. అంతటితో ఆగకుండా, అలా చేసిన పూరీని నేరుగా తీసి పక్కనే మరుగుతున్న నూనె కడాయిలో వేసి వేయించాడు.
నెట్టింట నవ్వుల పువ్వులు.. నెటిజన్ల ఘాటు కామెంట్స్
ఈ వింత విన్యాసాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"ఏంట్రా బాబూ ఈ ఘోరం.. ఆ పూరీ తింటే ఇక అంతే సంగతులు" అని ఒకరు కామెంట్ చేయగా..
"వీడు మామూలోడు కాదు.. టాలెంట్ అంటే నీదే భయ్యా" అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
"వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?" అంటూ కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
మొత్తానికి ఫేమస్ కావాలనే తపనతో ఈ వ్యక్తి చేసిన 'బొజ్జ పూరీల' వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.