Viral Video: డెస్క్ కింది నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్
Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు జనాలను బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి.
Viral Video: డెస్క్ కింది నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్
Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు జనాలను బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోసల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన ఆఫీస్ రూమ్‌లో పని చేస్తున్నాడు. అదే సమయంలో అతని డెస్క్ కింది నుంచి ఏదో శబ్ధం వినిపించింది. దీంతో సందేహం వచ్చి ఏంటా చూడగా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. డెస్క్ కింద ఒక పెద్ద పాము కనిపించింది.
'మిరాకిల్ మ్యాన్ కాష్' అని తనను పిలిచించుకునే ఈ కంటెంట్ క్రియేటర్ కొలరాడోలో ట్రెజర్ హంట్ క్లూస్‌ను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంటాడు. ఓ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్న సమయంలో అతని డెస్క్ కింద ఒక్కసారిగా పాము కనిపించడంతో షాక్‌కి గురయ్యాడు.
దీనంతటినీ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాసేపు డెస్క్ కింద ఉన్న పాము ఆ తర్వాత నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. అందులో నుంచి బయటకు వచ్చే గది మూలన ఉన్న గ్లాస్ డోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురైతే గుండె జల్లుమనాల్సిందే అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఉన్న పాము బుల్ స్నేక్. అమెరికాలోని కొలరాడోలో ఈ జాతికి చెందిన పాములు ఎక్కువగా కనిపిస్తాయి.