Viral Video: ఇలాంటోళ్లు పబ్లిక్ ప్లేస్‌లో అలా చేస్తే ఏమంటారు? పిక్నిక్ స్పాట్‌లో నీచ చేష్టలతో నెటిజన్లు భగ్గుమన్నారు Ask ChatGPT
లోనావాలా బుషీ డ్యామ్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించిన ఓ యువకుడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
Viral Video: ఇలాంటోళ్లు పబ్లిక్ ప్లేస్‌లో అలా చేస్తే ఏమంటారు? పిక్నిక్ స్పాట్‌లో నీచ చేష్టలతో నెటిజన్లు భగ్గుమన్నారు
లోనావాలా బుషీ డ్యామ్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించిన ఓ యువకుడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
వర్షాకాలపు పర్యటన కోసం వచ్చిన పర్యాటకులు ఆనందంగా కాలక్షేపం చేస్తున్న వేళ, ఓ వ్యక్తి నీటిలో ఈత కొడుతుండగా, మరొకడు అదే నీటిలో మూత్ర విసర్జన చేయడం నెట్టింట్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ అసహ్యకరమైన వీడియో చూసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ, "ఇలాంటోడు దొరికితే అక్కడే బుద్ధి చెప్పాలి" అంటూ మండిపడుతున్నారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బుషీ డ్యామ్ వద్ద జూలై 6న జరిగినట్లు తెలుస్తోంది. ప్రకృతి ప్రేమికులు, సెలవులు ఆస్వాదించేందుకు వచ్చే ప్రాంతాన్ని ఈ చర్య ఎంత దారుణంగా అపహాస్యం చేశారో వీడియో స్పష్టంగా చూపుతోంది.