Viral Video: కష్టంతో కాదు తెలివితో పని చేయాలి.? ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకోవాల్సిందే
Viral Video: కష్టపడి పనిచేయాలని చెబుతుంటారు. కానీ తెలివిని ఉపయోగించి ఎంత కష్టమైనా పనినైనా సరే స్మార్ట్‌గా చేయొచ్చని కొందరు నిరూపిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది కచ్చితంగా నిజం అని ఒప్పుకోవాల్సిందే.
Viral Video: కష్టంతో కాదు తెలివితో పని చేయాలి.? ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకోవాల్సిందే
Viral Video: కష్టపడి పనిచేయాలని చెబుతుంటారు. కానీ తెలివిని ఉపయోగించి ఎంత కష్టమైనా పనినైనా సరే స్మార్ట్‌గా చేయొచ్చని కొందరు నిరూపిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది కచ్చితంగా నిజం అని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక యువకుడు ఇటుకలు మోస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఇతని విధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణంగా పనివాళ్లు కొన్ని ఇటుకల్ని మాత్రమే మోస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పదుల సంఖ్యలో ఇటుకలను ఒకదానిపై ఒకటి అమర్చాడు.
అంతటితో ఆగకుండా... తలపై పెట్టిన తరువాత చేతులతో మరిన్ని ఇటుకలను గాలిలోకి విసిరి వాటినే మిగిలిన వాటిపై సరిగ్గా పడేటట్లు స్టైల్‌గా అమర్చాడు. ఇతడి వేగం, నిపుణత చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇటుకలు మోసే పని ఓ శ్రమతో కూడిన ఉద్యోగం. అయితే ఈ యువకుడు మాత్రం దానికి ఓ స్టైల్ జోడించి చేశాడు. తలపై భారంగా ఉన్నప్పటికీ ఎంతో క్రియేటివిటీగా ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చిన విధానం అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెలివి ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా ఇట్టే చేయొచ్చని చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనం అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.