Viral Video: హెచ్చరించినా వినలేదు.. చివరికి చిక్కుల్లో పడ్డారు – ఏం జరిగిందంటే?

ఎక్కడ పడితే అక్కడ స్టంట్స్‌ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. రోడ్డుపై చేయాల్సిన స్టంట్స్‌ను బీచ్‌లో చేసి కొందరు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు.

Update: 2025-07-22 13:23 GMT

Viral Video: హెచ్చరించినా వినలేదు.. చివరికి చిక్కుల్లో పడ్డారు – ఏం జరిగిందంటే?

ఎక్కడ పడితే అక్కడ స్టంట్స్‌ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. రోడ్డుపై చేయాల్సిన స్టంట్స్‌ను బీచ్‌లో చేసి కొందరు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఖరీదైన బెంజ్‌ కారుతో ప్రమాదకర స్టంట్స్‌ చేయడానికి ప్రయత్నించిన వాళ్ల కారు చివరికి ఇసుకలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ డ్యూమాస్‌ బీచ్‌లో చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం – కొందరు యువకులు సరదాగా గడపడానికి బెంజ్‌ కారుతో బీచ్‌కి వెళ్లారు. బీచ్‌లోకి వాహనాలకు అనుమతి లేదని అధికారులు హెచ్చరించినా, ఆ నిబంధనలను పట్టించుకోకుండా కారును లోపలికి తీసుకెళ్లారు. సమాచారం ప్రకారం, వాళ్ల ఉద్దేశ్యం అక్కడ స్టంట్స్‌ చేయడమే.

అయితే స్టంట్స్‌ చేస్తుండగా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. సగం వరకు నీటిలో మునిగిన కారును బయటకు తీసేందుకు యువకులు తీవ్రంగా శ్రమించారు. టైర్ల చుట్టూ ఇసుక తీయడం, కారును ముందుకు లాగడం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సన్నివేశాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది తెగ వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. బీచ్‌లోకి వాహనం తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని, వీడియో ఆధారంగా కారు యజమాని ఎవరో, ఘటన ఎప్పుడు జరిగిందో గుర్తించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.



Tags:    

Similar News