Viral Video: పక్కా ప్లానింగ్‌తో చేసిన వీడియో.. అయినా కూడా సూపర్‌ మెసేజ్‌..!

Viral Video: ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించే క్రమంలో రకరకాల కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తున్నారు.

Update: 2025-02-12 11:21 GMT

Viral Video: పక్కా ప్లానింగ్‌తో చేసిన వీడియో.. అయినా కూడా సూపర్‌ మెసేజ్‌..!

Viral Video: ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించే క్రమంలో రకరకాల కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల కంటే స్మార్ట్‌ ఫోన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చేతిలో మొబైల్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. ఫ్లైట్‌ టికెట్ బుకింగ్ మొదలు టీ కొట్టులో పేమెంట్‌ వరకు అన్నింటికీ స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. అయితే స్మార్ట్‌ ఫోన్‌ మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పే ఓ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటోంది.

ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుకుంటూ చంకలో తన బిడ్డను ఎత్తుకుంది. మరో చేతిలో ఇంట్లోని చెత్త కవర్‌ను పట్టుకుంది. అయితే ఆ మహిళ ఫోన్‌ మాట్లాడుతూ చెత్త బుట్టలో చెత్త కవర్ వేయాల్సింది కానీ, పొరపాటున పిల్లాడిని వేసింది. ఆ తర్వాత కొంత దూరం వెళ్లి.. తన తప్పును తెలుసుకుని తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని తిరిగి ఎత్తుకుంది. తిరిగి చెత్త కవర్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే ఈ వీడియోను చూస్తుంటే పక్కాగా దీన్ని క్రియేట్‌ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ వీడియోలో మాత్రం గొప్ప సందేశాన్ని అందించారు. స్మార్ట్‌ఫోన్‌ అడిక్షన్‌ మనిషిని ఆలోచనను ఎలా దెబ్బ తీస్తుందో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి వీడియోను చూసేయండి.


Tags:    

Similar News