Viral Video : భయ్యా ఆపండి..దిగిపోతా..లిఫ్ట్ అడిగితే ప్రాణాలు పోయినంత పనైంది
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు.
Viral Video : భయ్యా ఆపండి..దిగిపోతా..లిఫ్ట్ అడిగితే ప్రాణాలు పోయినంత పనైంది
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వేల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. సుమారు 25 లక్షల విలువైన సుజుకి హయబుసా బైక్ మీద లిఫ్ట్ అడిగిన ఒక యువకుడికి ఎలాంటి అనుభవం ఎదురైందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుర్రాడు ఎంతో ఇష్టంగా భారీ హయబుసా బైక్ దగ్గరకు వచ్చాడు. రైడర్‌తో కాసేపు ముచ్చటించి, ఆ స్పోర్ట్స్ బైక్ గురించి అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఆగకుండా భయ్యా నన్ను కొంచెం ముందుకు డ్రాప్ చేస్తారా? అని రిక్వెస్ట్ చేశాడు. రైడర్ కూడా సరేనని అతన్ని వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉంది కానీ, అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది.
బైక్ స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళగానే, వెనకాల కూర్చున్న యువకుడికి అత్యుత్సాహం పెరిగిపోయింది. భయ్యా బైక్ చాలా స్లోగా వెళ్తోంది, కొంచెం స్పీడ్ పెంచండి అని రైడర్‌కు ఉచిత సలహా ఇచ్చాడు. దాంతో రైడర్ నవ్వుతూ.. చూసుకో తమ్ముడూ.. తట్టుకోగలవు కదా? అని ఒక వార్నింగ్ ఇచ్చి గేర్ మార్చాడు. ఇంకేముంది, క్షణాల్లో బైక్ రాకెట్ లా దూసుకెళ్లింది. ఆ వేగానికి వెనకాల కూర్చున్న కుర్రాడికి చుక్కలు కనిపించాయి. గాలివాటం తట్టుకోలేక, గట్టిగా అరుస్తూ భయ్యా ఆపండి.. ప్లీజ్ ఆపండి! అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు.
కుర్రాడి కేకలు విన్న రైడర్ కూడా నవ్వు ఆపుకోలేక, సరదా కోసం మరికొంత దూరం స్పీడ్ గానే వెళ్ళాడు. చివరికి బైక్ ఆపగానే ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. రైడర్ మళ్ళీ నవ్వుతూ అరే ఏమైంది? కూర్చో.. రెండు నిమిషాల్లో దింపేస్తాను అన్నాడు. కానీ ఆ దెబ్బకు భయపడిపోయిన కుర్రాడు.. వద్దు భయ్యా.. చాలా థాంక్స్. నేను బస్సులోనే వెళ్తాను, మీరు వెళ్ళండి అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు.
@talkative_rider అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి షేర్ అయిన ఈ వీడియోకి ఇప్పటికే 1.71 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాపం.. ఆ కుర్రాడు ఇక జీవితంలో స్పోర్ట్స్ బైక్ జోలికి వెళ్లడు అని ఒకరు కామెంట్ చేయగా, ఇంకా చెప్పండి.. స్పీడ్ పెంచమని! అంటూ మరొకరు ఎగతాళి చేస్తున్నారు. మరికొందరైతే హయబుసా అంటే ఆషామాషీ కాదు తమ్ముడూ అంటూ సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా అతి ఉత్సాహం ప్రదర్శిస్తే ఎలాంటి ఫన్నీ అనుభవాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా నిలిచింది.