Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో రిస్కీ స్టంట్.. చివరికి ఏమైందంటే
Viral Video: యువత రీల్స్ మోజులో మునిగితేలుంది. ఫేమ్ కోసం ఏ స్థాయిలోకైనా వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రమాదమోనన్న భయం లేకుండా, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో రిస్కీ స్టంట్.. చివరికి ఏమైందంటే
Viral Video: యువత రీల్స్ మోజులో మునిగితేలుంది. ఫేమ్ కోసం ఏ స్థాయిలోకైనా వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రమాదమోనన్న భయం లేకుండా, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సముద్ర తీరాలు, ఎత్తైన కొండలు, జంతుప్రదర్శనశాలలు, రద్దీ రోడ్లు, రన్నింగ్ ట్రైన్స్ ఇలా కాదేది రీల్స్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితి మారింది.
తాజాగా ఒక యువతి రన్నింగ్ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి, రైలు కదులుతున్నా కూడా బయటకు వేలాడుతూ ఫోజులు ఇస్తోంది. ఆమె చేస్తున్న రిస్కీ స్టంట్లు కొంతమంది మిత్రులు వీడియో తీశారు. దీంతో ఆ యువతి మరింతగా రెచ్చిపోయింది. అదే సమయంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే కిందపడే ఐరన్ రాడ్‌ను పట్టుకుంది.
అయితే ఆ సమయంలో ట్రైన్ వేగం ఒక్కసారిగా తగడ్డంతో అదృష్టం కొద్దీ ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది రీల్స్ కాదు.. రిక్వెస్ట్ ఫర్ డెత్” అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
నిజానికి ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తూ మరణించిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎత్తైన కొండలపై, జలపాతల వద్ద రీల్స్ చేస్తూ గల్లైంతన వారు చాలా మంది ఉన్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా యువత తీరు మాత్రం మారడం లేదు.