Viral Video: పామును గుటుక్కున మింగేసిన కప్ప.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..!

Viral Video: సాధారణంగా పాములకు గద్దలు, ముంగీసలు, కుక్కలు బద్ధ శత్రువులుగా ఉంటాయని చెబుతారు.

Update: 2025-05-30 04:59 GMT

Viral Video: పామును గుటుక్కున మింగేసిన కప్ప.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..!

Viral Video: సాధారణంగా పాములకు గద్దలు, ముంగీసలు, కుక్కలు బద్ధ శత్రువులుగా ఉంటాయని చెబుతారు. అందుకే పాములు వీటి కంట పడకుండా ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాయి. పాములు ఎక్కువగా రాత్రిపూట వేటకు వెళ్లి, ఎలుకలు, కప్పల్ని వేటాడి తింటూ ఉంటాయి. తరచుగా పాముల వేట వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక షాకింగ్ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పామూ–కప్ప మధ్య జరిగిన ఈ ఘర్షణ ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వేట కోసం వెళ్లిన పాము ఓ కప్పను పట్టేయాలని ప్రయత్నించింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.

పాము దాడికి రెడీ అవుతుండగానే, ఆ కప్పు ఓవర్ స్మార్ట్‌గా రియాక్ట్ చేసి.. ఎదురుదాడికి దిగింది. పామును గట్టిగా ఒడిసి పట్టుకుని.. విడిచిపెట్టలేదు. చివరికి దానిని చుక్కలు చూపించి, అమాంతం మింగేసింది. పాపం పాము మాత్రం కప్ప నోటి నుంచి తప్పించుకోలేక విలవిల్లాడిపోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘బాప్ రే.. ఈ కప్ప చాలా వయోలెంట్ బ్రో!’’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాముల మీద కప్ప ఇలా దాడి చేయడం అరుదైన విషయమని, ఇది నిజంగా షాకింగ్ అని మరికొందరు అంటున్నారు.


Tags:    

Similar News