Viral Video: చూడ్డానికి ముసలివాడే కానీ.. ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.
Viral Video: చూడ్డానికి ముసలివాడే కానీ.. ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? ఇందులో ఏముందో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
వివరల్లోకి వెళితే.. ఓ యువకుడు వృద్ధుడికి కారు కీ అందించాడు. అయితే అది ఒక స్పోర్ట్ కారు. తాళం చెవి ఇచ్చే ముందే ఆ యువకుడు వృద్ధుడితో నెమ్మదిగా వెళ్లు అని చెబుతాడు. సహజంగా ఆ వయసున్న వ్యక్తి ఎవరైనా కారును నెమ్మదిగానే డ్రైవ్ చేస్తారు.
కానీ వీడియోలో ఉన్న యువకుడు మాత్రం ఒక ప్రొఫెషనల్ కార్ రేసర్‌లాగా డ్రైవ్ చేశాడు. జీరో కట్ కొట్టి కారును గిర్రున తిప్పేశాడు. దీంతో ఇది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పాతికేళ్ల కుర్రాడిలా తాత చేసిన పనికి ఫిదా అయ్యారు.
దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు సుమారు 13 వేల మంది లైక్ చేశారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. వయసు శరీరానికి మాత్రమే కానీ, మనసుకు కాదని ఈ తాత నిరూపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.