Viral Video: ఘోస్ట్ రైడర్‌కి తమ్ముడిలా ఉన్నాడు..బాడీ మొత్తం నిప్పులే..ఏం గుండె రా బాబు నీది!
Viral Video: నేటి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు.
Viral Video: ఘోస్ట్ రైడర్‌కి తమ్ముడిలా ఉన్నాడు..బాడీ మొత్తం నిప్పులే..ఏం గుండె రా బాబు నీది!
Viral Video: నేటి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్‌లు, షేర్‌ల కోసం ప్రాణాలను పణంగా పెడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు మండిపోవాల్సిందే. చలి నుంచి తప్పించుకోవడమో లేక రీల్స్ కోసం వెరైటీగా ట్రై చేయడమో తెలియదు కానీ, ఒక వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిని చూసిన నెటిజన్లు బతుకుపై తీపి లేని చవకబారు ఘోస్ట్ రైడర్ అంటూ మండిపడుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్ మీద వెళ్తున్న తీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ వ్యక్తి తన ఒళ్లంతా ఎండు గడ్డి కట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా బైక్ హ్యాండిల్ కి ఇరువైపులా రెండు పాత్రలను కట్టి, వాటిలో నిప్పులు రాజేశాడు. సీటు వెనుక కూడా ఒక పాత్రలో మంటలు మండుతున్నాయి. విచిత్రం ఏమిటంటే.. తన తలపై ఒక టిన్ డబ్బా పెట్టుకుని దాని పైన, చుట్టుపక్కల మంటలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తుంటే ఒక కదిలే అగ్నిపర్వతంలా అతడు బైక్ నడుపుతున్నాడు. గాలికి ఆ మంటలు ఎగిసి పడుతున్నా అస్సలు భయం లేకుండా రోడ్డుపై వెళ్తున్నాడు.
ఈ వీడియో @brijeshchaodhry అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా, నిమిషాల్లోనే వేల వ్యూస్ సంపాదించింది. అయితే నెటిజన్లు మాత్రం అతడిని ప్రశంసించడం మానేసి ఘాటుగా విమర్శిస్తున్నారు. "రీల్స్ కోసం ఇంత నీచానికి దిగుతారా? ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం తగలబడిపోతావని తెలీదా?" అని ఒకరు ప్రశ్నించగా, "ఇతడు హాలీవుడ్ ఘోస్ట్ రైడర్‌కి దేశీ వెర్షన్ లా ఉన్నాడు" అని మరొకరు ఎద్దేవా చేశారు. ఇలాంటి స్టంట్స్ కేవలం చేసే వారికే కాదు, రోడ్డుపై వెళ్లే మిగతా వాహనదారులకు కూడా ప్రమాదకరమని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ 13 సెకన్ల వీడియో సోషల్ మీడియా క్రేజ్ ఏ స్థాయికి వెళ్ళిందో అద్దం పడుతోంది. కేవలం 100 మంది చూస్తారనో, 10 మంది లైక్ కొడతారనో ప్రాణాలను పణంగా పెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. గతంలో కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. చలికాలం అని చెప్పి నిప్పులు ఒంటి మీద పెట్టుకుని తిరగడం అనేది వివేకం అనిపించుకోదు. ఇలాంటి స్టంట్స్‌ను ఎవరూ అనుకరించవద్దని, ఇవి ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.