Viral Video: ప్రేయసితో గొడవపడ్డ ప్రియుడు.. ఏం చేస్తాడో తెలిస్తే చెంప చెల్లుమనిపిస్తారు
Viral Video: ప్రేమికుల మధ్య గొడవ అనేది సర్వసాధారణం. ఏదో ఒక సమయంలో గొడవపడడం కామన్. అయితే ఈ గొడవ చిలిపిగా ఉంటే పర్లేదు కానీ శృతిమించితే మాత్రం మొదటికే మోసం జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఓ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

వివరాల్లోకివెళితే ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో ఓ యువకుడికి ప్రియురాలితో గొడవ జరిగింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకు యువకుడు 40 అడుగుల ఎత్తులో ఉన్న హై వోల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌పైకి ఎక్కాడు.
రాయబరేలీకి చెందిన అంకిత్ సింగ్ అనే యువకుడు తన బంధువుల ఇంటికి ఉస్రైనా గ్రామానికి వచ్చాడు.
అక్కడే ఉన్న సమయంలో సోమవారం సాయంత్రం తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న మాట మొదలై, పెద్ద గొడవగా మారింది. ఆవేశంతో ఊరి బయటకు వెళ్లిపోయిన అంకిత్ హై వోల్టేజ్ కరెంట్ లైన్ టవర్ ఎక్కాడు.
దీనిని గమనించి ఓ వ్యక్తి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిపాటిలోనే పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. అంకిత్ బంధువులు, స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందికి దిగాలని కోరారు. అర్థరాత్రి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. చివరికి పోలీసులు అతడిని సురక్షితంగా కిందికి దించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు యువకుడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.