Viral Video: అమెజాన్‌ అడవుల్లో అనకొండ.. ఎలా వెళ్తోందో చూశారా..!

Viral Video: పాముల పేరొస్తేనే భయపడే మనకు, అనకొండ (Anaconda) అంటేనే మరింత భయంతో ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.

Update: 2025-05-12 10:45 GMT

Viral Video: అమెజాన్‌ అడవుల్లో అనకొండ.. ఎలా వెళ్తోందో చూశారా..!

Viral Video: పాముల పేరొస్తేనే భయపడే మనకు, అనకొండ (Anaconda) అంటేనే మరింత భయంతో ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పాముగా గుర్తించబడిన అనకొండ పై ఇప్పటికే అనేక హాలీవుడ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి భారీ అనకొండ నిజంగా మన కళ్ల ముందుపడితే? ఊహించడానికే భయమేస్తుంది కదూ! తాజాగా అమెజాన్ అడవుల్లో (Amazon Rainforest) ఓ భారీ అనకొండ కనిపించి సంచలనం రేపుతోంది.

దట్టమైన అమెజాన్ అడవి మధ్య ఓ నదిలో ఓ భారీ అనకొండ ఈదుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాఫ్టర్ నుండి ఈ దృశ్యాన్ని చిత్రీకరించినట్టు స్పష్టమవుతోంది. అనకొండ నీటిలో ఈదుతూ వెళ్లడం, దాని భారీ శరీర ఆకారం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

అంతటి పెద్ద అనకొండను చాలా దూరం నుంచే చూస్తేనే భయమేస్తుంది. మరి దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. నదిలో వేగంగా ఈదుతున్న అనకొండ వీడియో చూసిన నెటిజన్లు… ‘‘ఇది నిజమేనా?’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సినిమా సీన్ చూస్తున్నట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News