Viral Video: పశువుల కొట్టం నుంచి ఏవో చప్పుళ్లు… చూసేసరికి రైతు షాక్!
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఓ రైతు తన పశువులకు మేత పెట్టేందుకు కొట్టంలోకి వెళ్లాడు. ఈ సమయంలో అక్కడ ఏవో చప్పుళ్లు వినిపించడంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడగా… కనిపించిన దృశ్యం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అరవై కోబ్రా పిల్లలు!
కొట్టం నుంచి 60 కోబ్రా పిల్లలు బయటపడ్డాయి. అత్యంత విషపూరితమైన ఈ పాములను చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా, అతను అక్కడికి చేరుకుని పాములను సురక్షితంగా పట్టుకుని ఓ పెట్టెలో వేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
ఎవరికి హాని జరగలేదు
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోబ్రా పిల్లలతో నిండిన దృశ్యాన్ని చూసి నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.