Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. పడగ విప్పి మరీ తోకతో బోరింగ్ కొడుతున్న నాగు పాము..

Viral Video: ఈ మధ్యకాలంలో పాముల వీడియోలకు సోషల్ మీడియాలో అమితమైన క్రేజ్ ఏర్పడింది.

Update: 2025-07-01 04:48 GMT

Viral Video: ఈ మధ్యకాలంలో పాముల వీడియోలకు సోషల్ మీడియాలో అమితమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో పాములతో సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడైనా పాము కనిపించినా వెంటనే మొబైల్ ఫోన్ తీసి వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారిపోతున్నాయి.

అంతేకాదు, పాముల వింత ప్రవర్తనలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ అరుదైన సంఘటనతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక నాగుపాము బోరింగ్‌పై పడగ విప్పి నిలబడింది. అదే సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను బోరింగ్ నుంచి నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా, ఆ పాము తన తోకతో బోరింగ్‌ను కొట్టడం మొదలుపెట్టింది. దీంతో నీళ్ల ప్రవాహం పెరిగి, ఆ వ్యక్తి సులువుగా తాగగలిగాడు.

ఆ వ్యక్తి దీనిని నాగేంద్రుడి అనుగ్రహంగా భావించి తన దాహాన్ని తీర్చుకున్నాడు. అక్కడ ఉన్న మరికొంత మంది ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. “బాప్ రే! ఇదెక్కడి వింత?”, “పాము బోరింగ్ కొడుతుందా?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు దీని నిజమెంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే, వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

పాముల వీడియోలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండగా, ఇలా వింత సంఘటనలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా అలాంటి ఆసక్తికర వీడియో చూస్తే, తనిఖీ చేసి మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News