Viral News: గంజాయి మత్తులో వ్యక్తి హల్‌చల్ – కారును ఆపి, బానెట్‌పైకి ఎక్కి దాడి యత్నం

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మూసాపేటలో నడిరోడ్డుపై గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని దాదాగిరి ప్రదర్శించాడు. కారు బానెట్‌పైకి ఎక్కి, విండ్షీల్డ్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు.

Update: 2025-07-23 13:33 GMT

కారులోని కుటుంబం భయంతో గజగజలాడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కారు మీద నుంచి దించారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడి వారు ఫోన్‌లో రికార్డ్ చేయడంతో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న వ్యక్తుల దారుణాలకు కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మద్యమత్తు, డ్రగ్స్ ప్రభావంతో ఇలాంటి దాడులు పెరుగుతుండటంతో, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News