Viral News: భార్యను మేడ పై నుంచి తలకిందులుగా వేలాడదీసిన భర్త.. వైరల్ వీడియో
Viral News: తాజాగా బరేలీలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Viral News: భార్య, భర్తలన్నప్పుడు గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే వాటికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. గొడవలు అనేది సరదాగా ఉండాలి కానీ దాడులకు దారి తీయకూడదు. తాజాగా బరేలీలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బరేలీలో నివసిస్తున్న నితిన్ సింగ్, డాలీ దంపతులకు వివాహమై 12 ఏళ్లు గడిచింది. నితిన్‌కు మద్యం అలవాటు తీవ్రమైంది. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడటం అతడి నిత్యక్రత్యంగా మారింది. నితిన్ మే 13వ తేదీన కూడా మద్యం సేవించి ఇంటికి చేరాడు. ఆ రోజు భార్యతో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి, తన వికృత స్వభావాన్ని బయట పెట్టాడు.
గొడవ సమయంలో డాలీని ఇంటి మేడపైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఆమెను తలకిందులుగా వేలాడదీశాడు. ఈ హింసాత్మక చర్యను అతడు సుమారు ఐదు నిమిషాల పాటు కొనసాగించాడు. భయంతో డాలీ గట్టిగా అరవడంతో పొరుగువాళ్లు స్పందించి వెంటనే అక్కడికి వచ్చారు. వారు ఆమెను కాపాడి కిందకు దించారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో, నితిన్‌తో పాటు అతడి తల్లి, సోదరుడు, సోదరుడి భార్యపై కేసు నమోదు చేశారు. నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు నితిన్ దారుణతపై తీవ్రంగా స్పందిస్తున్నారు.