Viral Video: పాము పుట్ట సమీపంలో నాగిని సాంగ్ ప్లే చేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Viral Video: ఒకప్పుడు గ్రామాల్లో పాములను బూర ఊదుతూ ఆడించేవారు. ఆ రోజుల్లో అది ఒక జీవనోపాధి. కానీ ఇప్పుడు అదే పని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, ట్యూన్స్‌తో చేస్తూ పాముల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. కొంతమంది యువకులు పాము పుట్ట దగ్గరికి వెళ్లి తమ ఫోన్లో ‘నాగినీ’ ట్యూన్ ప్లే చేశారు. ఆ ఫోన్‌ను పుట్ట దగ్గరే ఉంచి ఫోన్‌లో ప్లే చేస్తూ, మరో ఫోన్‌ను వీడియో రికార్డింగ్ కోసం ఏర్పాటు చేశారు. కొద్ది క్షణాల్లోనే ఆశ్చర్యంగా, ఓ పాము బయటికి వచ్చి ఆ ట్యూన్‌కు అనుసరంగా కదిలింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దానికి కోటి 50 లక్షల వ్యూస్, లక్షల లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో కేవలం కనికట్టు మాత్రమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పాములు బూర శబ్ధానికి కాకుండా వాయిస్తున్న వ్యక్తి కదలికలను అనుసరించి కదులుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.