Viral Marriage: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి ప్రేమ వివాహం.. పెళ్లికి ముందు నాలుగేళ్లు లీవ్‌ ఇన్‌ రిలేషన్‌ కూడా!

Viral Marriage: 72 ఏళ్ల స్టానిస్లావ్‌ అనే వృద్ధుడు, 27 ఏళ్ల అన్‌హెలినాతో ప్రేమలో పడి, దాదాపు 45 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Update: 2025-09-21 02:30 GMT

Viral Marriage: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి ప్రేమ వివాహం.. పెళ్లికి ముందు నాలుగేళ్లు లీవ్‌ ఇన్‌ రిలేషన్‌ కూడా!

Viral Marriage: ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా, ఉక్రెయిన్‌కు చెందిన ఓ విదేశీ జంట ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 72 ఏళ్ల స్టానిస్లావ్‌ అనే వృద్ధుడు, 27 ఏళ్ల అన్‌హెలినాతో ప్రేమలో పడి, దాదాపు 45 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

నాలుగేళ్ల సహజీవనం.. ఆ తర్వాత వివాహం

నాలుగేళ్ల క్రితం స్టానిస్లావ్‌, అన్‌హెలినాలకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వీరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక నాలుగేళ్ల పాటు సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్) చేశారు. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ జంట, హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

అందుకోసం భారతదేశానికి వచ్చిన ఈ జంట జైపూర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్ వంటి నగరాలను సందర్శించారు. వారికి జోధ్‌పూర్‌లోని మెహ్రన్‌గఢ్ కోట బాగా నచ్చడంతో అక్కడే హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.

హిందూ సంప్రదాయంలో పెళ్లి వేడుక

పెళ్లి వేడుకలు ఖాస్‌బాగ్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. వరుడు స్టానిస్లావ్‌ రాయల్ షేర్వాణీ, కేశర పాగ, రత్నాల తలపాగా ధరించి, గుర్రంపై వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. వధూవరులు వరమాలలు మార్చుకున్నారు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య అగ్ని చుట్టూ ఏడడుగులు వేశారు. ఆ తర్వాత స్టానిస్లావ్‌ తన వధువు మెడలో మంగళసూత్రం కట్టి, నుదుటిన సింధూరం పెట్టారు.

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతుండగా, మరికొందరు మాత్రం "ప్రేమ గీమ జాన్తానై.. డబ్బుల కోసమే ఈ పెళ్లి" అంటూ విమర్శిస్తున్నారు.




Tags:    

Similar News