Viral Video: ఏం గుండె అన్న నీది.. మొసలితో ఎంతటి చెలగాటం
Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని పంచితే మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Viral Video: ఏం గుండె అన్న నీది.. మొసలితో ఎంతటి చెలగాటం
Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని పంచితే మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
“@therealtarzan” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ భారీ క్రొకడైల్ హాయిగా సేదా తీరుతుందో. అంతలోనే వెనకాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాని తోకను పట్టుకొని నెమ్మదిగా కదిలించడం ప్రారంభించాడు.
దీంతో మొసలి ఒక్కసారిగా రెచిపోయింది. పెద్దగా నోరు తెరిచి వెనక్కి తిరిగింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వీడియో చూస్తే గుండె గుబేల్ మనడం ఖాయమని చెప్పడంలో సందేహం లేదు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే మనోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతుంటే మరికొందరు మాత్రం ఇంతటి రిస్క్ అవసరమా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి సాహసాలు చేస్తూ కొందరు వ్యక్తులు మరణించిన సంఘటనలు చూసే ఉంటాం. అయినా కూడా కొంతమంది సాహసం కోసమే, బతుకు దెరువు కోసమే ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తూ ఉంటారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ డేంజరస్ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.