Viral Video: కోడలా? కొరివి దయ్యమా? అత్త తాళి పట్టి లాగుతూ..కిందపడ్డ మామను తన్నుతూ, బెంగళూరు వైద్యురాలి దుర్మార్గం..

Bengaluru Doctor Attacks In-laws: ఈ వీడియో చూస్తే కచ్చితంగా మీరు కూడా కోడలా? కొరివి దయ్యమా? అంటారు. వయస్సు మీద పడ్డ అత్తామామపై ఓ బెంగళూరు వైద్యురాలు దాడి చేసిన వీడియో నెట్టింటా వైరల్‌ అవుతుంది.

Update: 2025-03-15 09:13 GMT

Viral Video: కోడలా? కొరివి దయ్యమా? అత్త తాళి పట్టి లాగుతూ..కిందపడ్డ మామను తన్నుతూ, బెంగళూరు వైద్యురాలి దుర్మార్గం..

Viral Bengaluru Doctor Attacks Shocking Video of Doctor Beating Elderly In-laws Goes Viral

Bengaluru Doctor Attacks In-laws: సోషల్ మీడియాలో వీడియోలు ఏవైనా ఆసక్తిగా, అవమానవీయంగా ఉంటే త్వరగా వైరల్‌ అవుతాయి. అలాంటి వీడియోపై త్వరగా స్పందిస్తారు కూడా. అయితే, తాజాగా ఓ వీడియో నెట్టింటా వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్‌ కోడలు వయస్సు మీద పడ్డ తన అత్తామామలపై దాడి చేసింది. వారిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కొడుతూ, కాళ్లతో తన్నుతూ ఉంది. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ షాకింగ్‌ ఘటన కర్నాటకలోని అన్నపూర్ణేశ్వరీ నగర్‌లో జరిగింది. అత్తామామలపై దాడి చేసిన ఈ డాక్టర్‌ కోడలి పేరు ప్రియదర్శిని వైద్య వృత్తిలో కొనసాగుతూ ఇలా అత్తామాలపై విరుచుకుపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు.

ఇక మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియదర్శిని ఆమె కొడుకు, కూతురు తన ఇంటికి మార్చి 10వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో వచ్చారు. వచ్చి రాగానే తనపై తన భార్యపై ఇష్టం వచ్చినట్లు తిడుతూ దాడికి దిగారని చెప్పారు. అంతకు ముందు కూడా తమను చంపుతామని బెదిరించిందని అన్నాడు. అయితే, తమ కొడుకు ప్రియదర్శినిని 2007లో పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత డివోర్స్‌ కేసు వేశారని చెప్పాడు.

కానీ, ప్రియదర్శిని మాత్రం తనని తన పిల్లలను అత్తామామ రెచ్చగొట్టే మాటలు అనడంతో సహనం కోల్పోయి అలా చేయాల్సి వచ్చిందని చెబుతోంది. తన భర్తను కలిసి పిల్లలకు తన నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కోసం మాత్రమే అడగటానికి వెళ్లాను కానీ, వారి చేతలకు నేను నా పిల్లలు సహనం కోల్పోయాం అని చెబుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు వైపులా నిజనిజాలు తెలుసుకుంటున్నారు. కానీ, సోషల్‌ మీడియా వేధికగా మాత్రమ డాక్టర్‌ కోడలి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ వీడియోలో దాదాపు ఓ ఐదు నిమిషాలపాటు అత్త తాళి పట్టి లాగుతూ, పెనుగులాటలో కింద పడ్డ మామను తన్నుతూ డాక్టర్‌ వృత్తిలో ఉండి ఇంత పైశాచికంగా వ్యవహరించింది. అయితే, మామ హార్ట్‌ పేషంట్‌, అత్త కూడా కేన్సర్‌తో బాధపడుతోందని తెలుస్తోంది. కోర్టులో కేసు ఉన్న నిబంధనలను అతిక్రమించి తమపై దాడి చేసిందని అత్తామామలు వాపోయారు.


Tags:    

Similar News