Viral Video: కూతురుని వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన తల్లి.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: దేశంలో మహిళలపై అనుచిత ప్రవర్తన రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Viral Video: కూతురుని వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన తల్లి.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: దేశంలో మహిళలపై అనుచిత ప్రవర్తన రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాలికల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, శిక్షలు పడుతున్నా ఇటువంటి చర్యల్లో మార్పు కనిపించడం లేదు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన అందరికీ గుణపాఠంగా మారింది.
హమీపూర్ జిల్లా ముస్కారా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి.. కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలిక వెంటపడడం మొదలు పెట్టాడు. గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. వేధింపులు అధికమవడంతో ఆ బాలిక తన తల్లికి విషయాన్ని చెప్పింది. ఆ విషయం తెలిసిన తల్లి ఒక్కసారిగా ఆగ్రహంతో చెలరేగింది. తన కూతుర్ని వెంటబెట్టుకుని వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లింది.
తన కళ్లముందే కూతుర్ని ఇబ్బంది పెట్టిన వాడిని చూసిన ఆమె.. ఆ వ్యక్తిపై ఒక్కసారిగా దాడికి దిగింది. వెంటనే చెప్పు తీసి నడిరోడ్డుపైనే అతడిపై దాడి ప్రారంభించింది. 9 సెకన్లలో అతడిని 15 సార్లు చెప్పుతో కొట్టింది. తల్లికి కోపం చల్లపడలేదు. చెప్పుతో మొత్తం 23 సార్లు దాడి చేసి అతడిని గట్టిగా శిక్షించింది.
ఆ మహిళ చెప్పుతో దాడి చేయగా ఆ వ్యక్తి అసహాయంగా అల్లాడిపోతూ విడిపెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె వదల్లేదు. తల, ముఖం లక్ష్యంగా దాడి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నడిరోడ్డుపైన ఇలా ఓ తల్లి చూపిన ధైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కూతుర్ని రక్షించేందుకు ఓ తల్లి తీసుకున్న చొరవ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
हमीरपुर: मनचले की पिटाई का वीडियो वायरल
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 12, 2025
🔸 किशोरी से छेड़छाड़ करने पर मां ने शोहदे को सिखाया सबक
🔸 9 सेकेंड में मां ने 15 चप्पलें मार कर किया शोहदे की धुनाई
🔸 परिजनों और किशोरी ने भी बीच सड़क पर युवक की पिटाई की
🔸 आरोपी युवक पिछले कुछ दिनों से किशोरी को परेशान कर रहा था
🔸… pic.twitter.com/l1qYcXwKwb