Viral News: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో..!
Viral News: సాధారణంగా తన పంజాకు చిక్కిన జంతువును వదలిపెట్టని చిరుత, ఒక లేగదూడ పట్ల చూపిన ఆదరణ కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది.
Viral News: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో..!
Viral News: సాధారణంగా తన పంజాకు చిక్కిన జంతువును వదలిపెట్టని చిరుత, ఒక లేగదూడ పట్ల చూపిన ఆదరణ కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. మైసూరు జిల్లా, హెగ్గడదేవనకోటె శివార్లలో చిరుత సంచరిస్తోందని అందిన ఫిర్యాదుల మేరకు అటవీ శాఖ అధికారులు ఒక బోను ఏర్పాటు చేసి, దానికి ఎరగా ఒక లేగదూడను ఉంచారు.
ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. అయితే, బోనులో ఉన్న దూడను తినడానికి బదులు, దాని పక్కనే ప్రశాంతంగా కూర్చుండిపోయింది. గురువారం ఉదయం బోనును పరిశీలించడానికి వచ్చిన అటవీ సిబ్బంది అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిరుత పక్కనే ఉన్న లేగదూడ ప్రశాంతంగా గడ్డి మేస్తోంది.
దూడకు ఎటువంటి హాని కలగకుండా అటవీ అధికారులు దానిని బోను నుంచి బయటకు తీశారు. అనంతరం, మత్తుమందు సాయంతో చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఒక క్రూరమైన చిరుతకు, ఒక నిస్సహాయమైన దూడకు మధ్య జరిగిన ఈ అరుదైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.