Viral News: మగాళ్లను నమ్మొద్దని వింత నిర్ణయం తీసుకున్న ఇద్దరు యువతులు.. వైరల్ అవుతోన్న వ్యవహారం..!

Viral News: ఈ వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేమలో మోసపోయినవారు ఎలా జీవితం గడపాలి అనే చర్చలకు కొత్త దారితీసింది.

Update: 2025-05-15 06:08 GMT

Viral News: మగాళ్లను నమ్మొద్దని వింత నిర్ణయం తీసుకున్న ఇద్దరు యువతులు.. వైరల్ అవుతోన్న వ్యవహారం..!

Viral News: పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అన్నట్లుగా ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరైనా, ప్రేమలో ఎదురయ్యే అనుభవాలు మాత్రం చాలా సమానంగా ఉంటాయి. ప్రేమించటం, మోసపోవటం అన్నివయసుల వారికి, అన్ని తరతరాలకు సంభవిస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమలో మోసపోయిన ఇద్దరు యువతులు చివరకు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీనా, సప్న అనే ఇద్దరు యువతులు, ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే ఆఫీసులో పని చేయటంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తన లవ్ ఫెయిల్యూర్స్, వ్యక్తిగత విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఇద్దరూ గతంలో ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడిన కుర్రాళ్ల చేతిలో మోసపోయిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ అనుభవం వారిద్దరినీ మరింత దగ్గర చేసింది.

స్నేహం నుండి ప్రేమగా మారిన బంధం…

ఒకరిపై ఒకరికి అభిమానం పెరగటం, భావోద్వేగాలు పంచుకోవటం ద్వారా స్నేహం ప్రేమగా మారింది. మగాళ్లు మళ్లీ మోసం చేస్తారన్న భయంతో, ఇద్దరూ కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఒక గుడిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. “మగాళ్లను నమ్మకూడదని తెలుసుకున్నాం… మగాళ్లు లేకుండా జీవనం గడపగలమని నిరూపించబోతున్నాం” అంటూ తన భావాలను పంచుకుంది.

ఈ వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేమలో మోసపోయినవారు ఎలా జీవితం గడపాలి అనే చర్చలకు కొత్త దారితీసింది.

Tags:    

Similar News