Viral Video: అందమైన జలపాతం వద్ద అరాచక కార్యక్రమాలు.. ఎన్నో ప్రశ్నలను సంధిస్తోన్న వీడియో
Viral Video: ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ తీసిన తాజా వీడియో భారతదేశంలో పబ్లిక్ ప్రదేశాల దయనీయ స్థితిపై మరోసారి చర్చకు తెర తీసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ లాపాస్ వాటర్‌ఫాల్ వద్ద పరిస్థితులు ఎంతలా దిగజారాయో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది.
Viral Video: అందమైన జలపాతం వద్ద అరాచక కార్యక్రమాలు.. ఎన్నో ప్రశ్నలను సంధిస్తోన్న వీడియో
Viral Video: ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ తీసిన తాజా వీడియో భారతదేశంలో పబ్లిక్ ప్రదేశాల దయనీయ స్థితిపై మరోసారి చర్చకు తెర తీసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ లాపాస్ వాటర్‌ఫాల్ వద్ద పరిస్థితులు ఎంతలా దిగజారాయో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజల నిర్లక్ష్య వైఖరి, తగిన సివిక్ సెన్స్ లేకపోవడం ఎలా పర్యాటక ప్రాంతాలనూ నాశనం చేస్తుందో ఈ వీడియో చూపిస్తోంది.
ఇన్‌ఫ్లూయెన్సర్ షేర్ చేసిన ఈ వీడియోలో వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న చెత్త, మద్యం సేవిస్తున్న వ్యక్తులు, ట్రైల్స్ పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక అడ్డాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె వ్యంగ్యంగా, "ఇండియాలో సివిక్ సెన్స్ బెస్ట్ అనుకుంటారు...జోక్ చెప్తున్నా! అసలు లేదు!ష అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇండియాలో సివిక్ సెన్స్ అనేది ఉండదు" అని ఓ యూజర్ స్పందించగా.. "మద్యం తాగే వారు అందమైన ట్రెక్కులను నాశనం చేస్తున్నారు" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.