Whisky: ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారతీయ విస్కీ బ్రాండ్లు.. టాప్‌లో ఉన్న‌వి ఇవే

Whisky: విస్కీ తయారీలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి ధాన్యాలను ముందుగా ఉడకబెట్టి, ఆ తరువాత ఈస్ట్‌తో పులియబెట్టే ప్రక్రియ జరుపుతారు. ఈ మార్గంలో ఆల్కహాల్ తయారవుతుంది.

Update: 2025-06-23 08:30 GMT

Whisky: ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారతీయ విస్కీ బ్రాండ్లు.. టాప్‌లో ఉన్న‌వి ఇవే

Whisky: విస్కీ తయారీలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి ధాన్యాలను ముందుగా ఉడకబెట్టి, ఆ తరువాత ఈస్ట్‌తో పులియబెట్టే ప్రక్రియ జరుపుతారు. ఈ మార్గంలో ఆల్కహాల్ తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని డిస్టిల్ చేసి, ఓక్ చెక్కతో చేసిన బారెల్స్‌లో సంవత్సరాలపాటు పరిపక్వం కోసం నిల్వ చేస్తారు. ఈ మొత్తం ప్ర‌క్రియ వల్ల విస్కీకి గాఢత, సువాసన, ప్రత్యేక రుచి ఏర్పడతాయి.

తాజాగా విడుద‌ల చేసిన డ్రింక్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిపోర్ట్ ప్రకారం, టాప్ 20 అంతర్జాతీయ విస్కీ బ్రాండ్లలో 10 కంటే ఎక్కువ భారతీయ బ్రాండ్లే ఉన్నాయి. ఇందులో మెక్‌డొనాల్స్‌, రాయ‌ల్ స్టాగ్‌, ఇంపీరియ‌ల్ బ్లూ వంటి బ్రాండ్లు టాప్ 3లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇవి భారత విస్కీల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 18 విస్కీ బ్రాండ్లలో 8 భారతదేశానికి చెందినవే. ఇది భారత విస్కీ పరిశ్రమ శక్తిని తెలియజేస్తుంది. ప్రస్తుతం దేశంలో విస్కీ మార్కెట్ మొత్తం ఆల్కహాల్ మార్కెట్‌లో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉంది. రాబోయే ఐదేళ్లలో సుమారు 10 కోట్ల మంది భారతీయులు చట్టబద్ధంగా మద్యం సేవించగల వయస్సుకు చేరుకుంటారు. ఇది మార్కెట్ విస్తరణకు మార్గం వేసే అవకాశం.

ప్రపంచ అతిపెద్ద ఆల్కహాల్ కంపెనీలు Diageo, Pernod Ricard వంటి సంస్థలకు భారత్‌ ఇప్పుడు వాల్యూమ్ పరంగా నెంబర్ వన్ మార్కెట్. Diageoకి 34 బ్రాండ్లు ఉండగా, Pernod Ricardకు 21 ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ కంపెనీలు భారత్‌లో లక్షల కేసుల విస్కీని విక్రయిస్తున్నాయి.

ఈ సంస్థల ప్రముఖ బ్రాండ్లలో Smirnoff, Johnnie Walker, Royal Stag, Imperial Blue ఉన్నాయి. ఇవి భారతీయ వినియోగదారులలో విశేష ఆదరణ పొందుతున్నాయి. Radico Khaitan సంస్థకు 8 మిలియనియర్ బ్రాండ్లు ఉండటం గమనార్హం. ఇందులో 8PM Whisky, Magic Moments Vodka అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సంస్థ ఇటీవల ‘Magic Moments Flavours of India’ పేరుతో కొత్త వోడ్కా రుచులను తీసుకువచ్చింది. ఆల్ఫోన్సో మామిడి, తందాయ్ రుచులతో తయారు చేసిన ఈ వేరియంట్లు ప్రస్తుతం రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోం, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ల‌భిస్తున్నాయి.

Tags:    

Similar News