Rakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!

Rakhi Festival: రాఖీ పండుగ వచ్చేసింది. సంప్రదాయం ప్రకారం సోదరి బొట్టు పెట్టి సోదరుడి చేతికి రాఖీ కడుతుంది.

Update: 2022-08-11 13:00 GMT

Rakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!

Rakhi Festival: రాఖీ పండుగ వచ్చేసింది. సంప్రదాయం ప్రకారం సోదరి బొట్టు పెట్టి సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. బదులుగా సోదరుడు ఆమెకు రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. అనేక సంస్కృతులు ఉన్న భారతదేశంలో రాఖీని ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఒకప్పుడు దూరంగా ఉన్న సోదరుల కోసం మహిళలు కొరియర్ ద్వారా రాఖీ పంపేవారు. కానీ నేడు డిజిటల్ ప్రపంచంలో చాలా విషయాలు సులువుగా జరుగుతున్నాయి. అయితే కొన్ని కొత్త మార్గాలని అనుసరించడం ద్వారా ఈ రాఖీ పండుగ మీకు చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

వీడియోలు, ఫొటోలు

సోదరులు, సోదరీమణులు బాల్యం నుంచి యవ్వనం వరకు ఒకే కుటుంబంలో జీవిస్తారు. కొన్నిసార్లు గొడవపడతారు, కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు ఆడుకుంటారు. ఇవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వీలైతే వీడియోలు లేదా ఫొటోల ద్వారా వాటిని ఒకసారి మీ సోదరికి గుర్తుచేయండి. వారు ఎంతో సంతోషిస్తారు.

పార్టీ వాతావరణం

కుటుంబ సభ్యులు వివాహాలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండుగలప్పుడు అందరు కలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో మంచి విందుతో పాటు వారి జ్ణాపకాలని నెమరువేసుకుంటారు. రాఖీ కూడా అలాంటి ఒక పండుగే. కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో పార్టీ వాతావరణాన్ని సృష్టించండి. డ్యాన్సులు చేస్తూ మీ సోదరిమణులని ఉల్లాసపరచండి.

సినిమా ప్లాన్

ఇక ఈ రోజును మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే సోదరిమణులతో కలిసి సినిమా చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చు. సినిమా టైమ్‌లో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది పని, బాధ్యతల కారణంగా ఒత్తిడిలో జీవిస్తాము. కుటుంబంతో గడిపే ఈ విధానం మిమ్మల్ని రిఫ్రెష్‌గా చేస్తుంది. ఇవన్ని మీకు మరిచిపోలేని అనుభూతులని మిగులుస్తాయి.

Tags:    

Similar News