Thunderstorms: అకాల వర్షాలు కురుస్తున్నప్పుడు పిడుగులు పడుతాయి.. కారణాలు ఏంటో తెలుసా..?

Thunderstorms: ఏప్రిల్‌, మే నెలలో అకాల వర్షాల కారణంగా పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి.

Update: 2024-05-02 13:30 GMT

Thunderstorms: అకాల వర్షాలు కురుస్తున్నప్పుడు పిడుగులు పడుతాయి.. కారణాలు ఏంటో తెలుసా..?

Thunderstorms: ఏప్రిల్‌, మే నెలలో అకాల వర్షాల కారణంగా పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. వీటివల్ల అక్కడక్కడ మనుషులతో పాటు పశువులు కూడా చనిపోతుంటాయి. మరికొన్ని చోట్ల ఆస్తినష్టం జరుగుతుంటుంది. అయితే పిడుగులు పడడానికి కారణం ఏంటి.. ఇవి ఎలా తయారవుతాయి.. పిడుగు పడే సమయంలో ఎలా తప్పించుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం.

ఎండలు, అధిక ఉష్ణోగ్రతలవల్ల నీరు ఆవిరిగా మారుతుంది. ఈ విషయం సాధారణంగా అందరికి తెలుసు. ఈ ప్రక్రియలో భాగంగానే ఆకాశంలో 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతా యి. ఈ సందర్భంలో పైనుంచి సూర్యరశ్మి అధిక ప్రభావం కారణంగా తక్కువ బరువు ఉన్న ధనావేశిత (+)మేఘాలు పైకి వెళ్తాయి. అదే సందర్భంలో అధిక బరువు ఉండే, దట్టమైన రుణా వేశిత మేఘాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం ఇలా వచ్చిన రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు దగ్గరలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షించబడతాయి.

కాగా ధనావేశిత మేఘాలు ఎత్తుగా వెళ్లినప్పుడు సమీపంలో మరే వస్తువు ఉన్నా, మనుషులు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ సందర్భంలోనే మేఘాల నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రాన్లు రిలీజై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు వేగంగా దూసుకొస్తాయి. దీనిని పిడుగుపాటు అంటారు. అలాగే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి.

ఏప్రిల్ చివరలో, మే నెలలో కురిసే అకాల వర్షాల సందర్భంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రదేశాల్లో, ఇండ్లల్లో ఉండటం మంచిది. పొలాల్లో పనిచేసే వారు చెట్ల కింద ఉండకుం డా గుడిసెల్లోకి, అడవుల్లో సంచరించేవారు రాతి గుహలు, ఇతర సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లడం ద్వారా తప్పించుకోవచ్చు. గ్రామాలు, నగరాల్లో నివసించేవారు కూడా చెట్లు, సెల్‌ఫోన్ టవర్ల కింద ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇక ఉరుములు, మెరుపుల సమయంలో సెల్‌ఫోన్లు వాడటం, మాట్లాడటం, ఎఫ్ఎం రేడియోలో పాటలు వినడం వంటివి చేయకూడదు. ఇతర ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా యూజ్ చేయకూడదు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News