Viral Incident: ఏమాత్రం ఉపేక్షించం.. ఓ కుర్రాడి పిచ్చి చేష్టలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన IPS సజ్జనర్..!

Viral Incident: యువతలో రీల్స్ పిచ్చి బాగా ముదురిపోయింది. రీల్స్ కోసం కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు.

Update: 2025-05-15 15:00 GMT

Viral Incident: ఏమాత్రం ఉపేక్షించం.. ఓ కుర్రాడి పిచ్చి చేష్టలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన IPS సజ్జనర్.

Viral Incident: యువతలో రీల్స్ పిచ్చి బాగా ముదురిపోయింది. రీల్స్ కోసం కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. టిక్ టాక్ బ్యాన్‌తో రీల్స్ పిచ్చి తగ్గుతుందనుకుంటే ఇంతలోనే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ వంటివి రీల్స్, షార్ట్స్ అంటూ మళ్లీ మొదలుపెట్టాయి. దీంతో కొందరు యువకులు మరింత రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ రీల్స్ చేస్తున్నారు. ప్రాంక్ అనే డైలాగ్‌తో పబ్లిక్‌ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్లని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియడం లేదు.

ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్చి వ్యాధిలా మారింది. సోషల్ మీడియాలో వింత వింత పనులు చేస్తూ ఫేమ్ తెచ్చుకోవాలని కొందరు క్రియేటర్లు చూస్తున్నారు. రీల్స్ కోసం రూడ్లపై అతి చేష్టలు చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన ఆర్టీసీ ఎండీ, IPS వీసీ సజ్జనర్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇంకోసారి అలాంటి రీల్ చేయాలంటే అమ్మో అనిపించేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎందుకు అంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియోలో ఏముందంటే?

ఆర్టీసీ బస్ కండక్టర్‌ని ఓ యువకుడు ఈ బస్సు గుంటూరు వెళ్తుందా అని అడిగాడు. దానికి కండక్టర్ బస్సు గుంటూరుకు వెళ్లదని చెప్పారు. అయితే, వెంటనే ఆ కుర్రాడు ఎవరితోనే మాట్లాడుతున్నట్లుగా.. తన చెప్పు తీసి చెవి దగ్గర పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా యాక్షన్ చేశాడు. అయితే, అతను అలా ఎందుకు చేశాడో బస్ కండక్టర్‌కి అర్థం కాలేదు. ఈ బస్సు గుంటూరు వెళ్లదంట అని మాట్లాడుతూ.. అక్కడి నుంచి అతను చల్లగా జారుకున్నాడు. ఆ కుర్రాడి వింత ప్రపర్తన కండక్టర్‌కి ఇబ్బందిని కలిగించింది. అతను రీల్ చేసుకోవడం కోసమే కావాలనే కండక్టర్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ట్విట్టర్‌లో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.


Tags:    

Similar News