Viral Video: వీడెక్కడి పెళ్లికొడుకురా బాబు… వీడియో చూసిన తర్వాత మీరు నవ్వు ఆపుకోలేరు..!

Viral Video: పెళ్లి వేడుకల్లో విచిత్రమైన సంఘటనలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు తెప్పిస్తే, మరికొన్ని సీరియస్‌గా మారిపోతుంటాయి.

Update: 2025-07-09 05:40 GMT

Viral Video: పెళ్లి వేడుకల్లో విచిత్రమైన సంఘటనలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు తెప్పిస్తే, మరికొన్ని సీరియస్‌గా మారిపోతుంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న ఓ పెళ్లి వీడియో మాత్రం నవ్వుల పంట పండిస్తోంది.

వివరాల్లోకి వెళితే… ఒక పెళ్లి వేడుకలో వరుడు తన ఉల్లాసభరితమైన చేష్టలతో అందరి మనసులు గెలుచుకున్నాడు. పెళ్లి తంతులో భాగంగా ‘రసగుల్లా తినిపించే’ కార్యక్రమం జరుగుతోంది. వధువు మొదట వరుడికి రసగుల్లా తినిపించింది. అది తినిపిస్తుండగా వరుడు నవ్వుతూ ఆనందంగా స్వీకరించాడు.

అయితే.. వరుడి వంతు రాగానే, రసగుల్లా తీసుకుని వధువుకు తినిపించబోతాడు. కానీ వధువు కొంచెం ఆలస్యం చేయడంతో, వేచి ఉండలేకపోయిన వరుడు ఆ రసగుల్లాను తానే గుటుక్కున తినేశాడు! ఈ చేష్టను చూసి వధువు సహా అక్కడున్నవాళ్లంతా నవ్వులలో మునిగిపోయారు.

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఇలాంటి టెన్షన్ లేని వరుడు దొరికితే జీవితమే పండగలా ఉంటుంది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అహంకారంగా ఉండే కొందరు వరులకంటే ఈ హాయిగా ఉండే వరుడే మిన్న అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

అంతేకాదు, "ఈ నవ్వే మీ జీవితాంతం కొనసాగాలి", "అసలైన సింపుల్ అండ్ క్యూట్ మెన్స్" అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ టెన్షన్ లేని వరుడు.. నెటిజన్ల మన్ననలు గెలుచుకుని ట్రెండింగ్‌లోకి ఎక్కిపోయాడు.


Tags:    

Similar News