Viral Video: నువ్వు తోపు అక్కా.!. ల్యాప్ టాప్‌ను ఇలా కూడా వాడతారా..?
Viral Video: తాజా కాలంలో యువత సోషల్ మీడియా క్రేజ్‌తో విచిత్రాలూ, వినోదప్రదమైన వీడియోలూ ఎక్కువగా చేస్తోంది.
Viral Video: నువ్వు తోపు అక్కా.!. ల్యాప్ టాప్‌ను ఇలా కూడా వాడతారా..?
Viral Video: తాజా కాలంలో యువత సోషల్ మీడియా క్రేజ్‌తో విచిత్రాలూ, వినోదప్రదమైన వీడియోలూ ఎక్కువగా చేస్తోంది. ఒక్క రోజులోనే ఫేమస్ అవ్వాలన్న ఉత్సాహంతో కొంతమంది యువతీ యువకులు తన మామూలు పనులకంటే భిన్నంగా, కాస్త రిస్క్‌గా, ఎక్కడైనా, ఎప్పుడైనా వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తే వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
కొంతమంది జలపాతాలు, సముద్రతీరాలు, పర్వత ప్రాంతాలు వంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి స్టంట్లు చేయడం, అడవుల్లోకి వెళ్లి పాములు, కోడికత్తులు, మరి కొన్ని క్రూర జంతువులతో సెల్ఫీలు దిగడం చేస్తుండగా… మరికొంత మంది పబ్లిక్ ప్రదేశాల్లో, రోడ్లపై, మెట్రో స్టేషన్లలో తన టాలెంట్‌ని చూపిస్తూ వీడియోలు పెడుతున్నారు.
అయితే తాజాగా ఓ యువతి టెకీ మాత్రం అందరికి భిన్నంగా, తన ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ సాధారణ రోజు బోర్‌గా కాకుండా కాస్త క్రియేటివ్‌గా ఏమైనా చేయాలనుకుంది. అందరూ పూరీలు పీట మీద లేదా ప్రెస్సర్ పాన్ మీద తయారు చేస్తుంటారు. కానీ ఈమె మాత్రం కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్ తీసుకుని దానిపై ప్లాస్టిక్ కవర్ వేసి, పూరి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ల్యాప్‌టాప్ కవర్ మీద పెట్టి, ల్యాప్‌టాప్ మూసి ప్రెస్ చేసింది.
దాంతో ఆ పిండిముద్దలు మెత్తగా, రౌండ్‌గా మారాయి. వాటిని తీసి వేడి కడాయిలో వేసి, బంగారు రంగులో కురకురలాడే పూరీలు తయారు చేసింది. అంతటితో ఆగకుండా, ఈ విచిత్ర ప్రయత్నాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సూపర్ స్పీడ్‌లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వినోదంగా కామెంట్లు చేస్తూ — "ఇదెక్కడి టాలెంట్ తల్లి!", "ల్యాప్‌టాప్‌తో పూరీలు వేశారంటే... కంపెనీ వాళ్లకు తెలిస్తే ఏం చేస్తారో!" అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం యువత ఏదైనా ఓవర్ నైట్ ఫేమ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి సోషల్ మీడియా కోసం చేసే వీళ్ల వినూత్న వినోదాలు చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తుంటారు కానీ, ఏదైనా ప్రమాదం జరుగకుండానే బాధ్యతతో ఉండాలని మరోమారు గుర్తుచేస్తోంది.