Viral Video: క్లాస్‌లో పాటలు వింటూ టీచర్ తలకు మసాజ్ – వీడియో వైరల్
క్లాస్‌రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఒక టీచర్ చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: క్లాస్‌లో పాటలు వింటూ టీచర్ తలకు మసాజ్ – వీడియో వైరల్
క్లాస్‌రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఒక టీచర్ చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విద్యార్థులతో నిండిన తరగతి గదిలో పాఠాలు చెప్పడం మానేసి, తలకు నూనె రాసుకుని సేదతీరుతూ హెడ్ మసాజ్ చేసుకుంటూ కూర్చుంది. అంతేకాదు, లౌడ్‌స్పీకర్‌లో బాలీవుడ్ సినిమా పాటలు వింటూ ఈ పనిని కొనసాగించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా, ముందఖేడ్ ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంట్లో చేసుకోవాల్సిన పనులు పాఠశాలలో చేస్తూ, విద్యార్థుల సమయాన్ని వృథా చేయడమేంటని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
వైరల్ వీడియోపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలు సంగీత మిశ్రాను వెంటనే సస్పెండ్ చేశారు. జిల్లా ప్రాథమిక విద్యాధికారి లక్ష్మీకాంత్ పాండే ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించారు.