Viral Video: బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Viral Video: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. మే 23వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Viral Video: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. మే 23వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పుదుకొట్టై దిశగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అయితే అప్రమత్తంగా స్పందించిన కండక్టర్ ధైర్యంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన శుక్రవారం ఉదయం కనకంపట్టి ప్రాంతంలో జరిగింది. ప్రభు అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే తన స్థితి గురించి పక్కనే ఉన్న కండక్టర్‌కు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి స్టీరింగ్ వదిలి సీటులో కూలిపోయాడు.
ఇంతలో బస్సు వేగంగా ముందుకు సాగుతుండగా, పరిసరాల్లోని పరిస్థితిని గమనించిన కండక్టర్ అప్రమత్తంగా స్పందించాడు. స్టీరింగ్ అందకపోయే సరికి వెంటనే తన చేతిలో బస్సు బ్రేక్‌ను గట్టిగా నొక్కాడు. దీంతో ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సు ఆగిన తర్వాత ప్రయాణికులు కలిసి డ్రైవర్ ప్రభును లేపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కండక్టర్ చూపిన సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.