Viral Video: ఇలా అయితే డాక్టర్లు దుకాణం మూసుకోవాల్సిందే.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో రోజు రోజుకు విచిత్రమైన వీడియోలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఆ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని భయానకంగా కూడా ఉంటున్నాయి. తాజాగా అలాంటి వీడియోల జాబితాలోకి మరో వీడియో వచ్చి చేరింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపక్కనే కూర్చుని దంత వైద్యం చేస్తూ కనిపిస్తున్నాడు. అతని వద్ద ఒక చిన్న పెట్టె ఉంది. అందులో వివిధ సైజుల్లో ఉన్న "దంతాలు" ఉన్నాయి. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి తనకు అనుకూలమైన దంతాలను అడిగాడు. వెంటనే అతను పెట్టెలో చూసి సరిపోయే దంతాన్ని తీసి, దానికి గమ్ అంటించి నోటిలో అమర్చి పెట్టాడు. ఇది అన్నీ కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయి.
ఈ వీడియోను @meinkiakaruu అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకి 3.6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది లైక్ చేయగా, అనేక మంది ఫన్నీ కామెంట్స్‌తో రెస్పాండ్ అవుతున్నారు. ఇలా అయితే డాక్టర్లు దుకాణాలు మూసుకోవాల్సిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రీట్మెంట్‌ను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిబంధనలు, పరిశుభ్రతా ప్రమాణాలు లేకుండా ఇలాంటి పనులు చేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అంటూ స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.