Strawberry Moon to Butterfly stars: ఆకాశంలో అద్భుతం.. జూన్‌లో జరిగే ఈ 9 ఖగోళ వింతలను అస్సలు మిస్ కాకండి
Strawberry Moon to Butterfly stars: అంతరిక్షం ఎన్నో రహస్యాలతో కూడిన, ఆసక్తికరమైన ప్రపంచం. నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు… ఇవన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రతి నెలా ఆకాశంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.
Strawberry Moon to Butterfly stars: ఆకాశంలో అద్భుతం.. జూన్‌లో జరిగే ఈ 9 ఖగోళ వింతలను అస్సలు మిస్ కాకండి
Strawberry Moon to Butterfly stars: అంతరిక్షం ఎన్నో రహస్యాలతో కూడిన, ఆసక్తికరమైన ప్రపంచం. నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు… ఇవన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రతి నెలా ఆకాశంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. జూన్ నెలలో జరగనున్న ఇలాంటి 9 ఖగోళ ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జూన్ 1: వేణస్ కనువిందు
జూన్ 1న వేణస్ గ్రహం సూర్యుడికి పశ్చిమ దిశలో అత్యధిక దూరంలో ఉంటుంది. దీనిని "గ్రేటెస్ట్ వెస్ట్రన్ ఎలాంగేషన్" అంటారు. ఇది వేణస్‌ను చూసేందుకు మంచి సమయం. తెల్లవారుఝామున, ఉత్తరార్థ గోళంలో తూర్పు ఆకాశంలో, దక్షిణార్థ గోళంలో తూర్పు-ఉత్తర దిశలో వేణస్ కనిపిస్తుంది.
జూన్ 2: గ్రేట్ హెర్కులిస్ క్లస్టర్
ఇది వేల నక్షత్రాలతో ఏర్పడిన ఒక భారీ గోళాకార సమూహం. దీనిని మెస్సియర్ 13 లేదా హెర్కులిస్ క్లస్టర్ అని పిలుస్తారు. జూన్ 2న ఇది ఆకాశంలో అత్యున్నత స్థానానికి చేరుతుంది. బైనాక్యులర్‌తో స్పష్టంగా వీక్షించవచ్చు. దీనిని 1714లో ఖగోళశాస్త్రవేత్త ఎడ్మండ్ హాలీ గుర్తించారు.
జూన్ 7: ఆరెటిడ్ ఉల్కాపాతం
ఇతర ఉల్కాపాతాలకంటే భిన్నంగా ఇది పగటి వేళల్లో కనిపించే ఉల్కావర్షం. కానీ ఉదయానికి ముందే లేచి చూస్తే, కొన్నిసార్లు రంగుల కాంతులతో కనిపించే చిన్న చుక్కలు చూడొచ్చు.
జూన్ 11: స్ట్రాబెర్రీ చంద్రుడు
జూన్ నెలలో వచ్చే పూర్ణచంద్రుని స్ట్రాబెర్రీ మూన్ అంటారు. చంద్రుడు ఎరుపు రంగులో ఉండదు కానీ ఈ పేరు ఉత్తర అమెరికాలోని ఆదివాసీ సంప్రదాయాల నుంచి వచ్చింది. జూన్ లో స్ట్రాబెర్రీలు పండే కాలం కావడం వల్ల ఇలా పిలుస్తారు.
జూన్ 16: బటర్‌ఫ్లై క్లస్టర్, మంగళ గ్రహం
జూన్ 16న మంగళగ్రహం, రెగ్యులస్ అనే నక్షత్రం సాయంత్రం సూర్యాస్తమానికి 90 నిమిషాల ముందు దగ్గరగా కనిపిస్తాయి. అర్ధరాత్రి తర్వాత బటర్‌ఫ్లై క్లస్టర్ అనే గోళాకార నక్షత్ర సమూహం బైనాక్యులర్‌తో చూడొచ్చు.
జూన్ 22: లగూన్ నెబులా
మెస్సియర్ 8 లేదా లగూన్ నెబులా అనే నక్షత్ర జనన ప్రాంతం జూన్ 22న అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరార్థ గోళంలో కొంతమందికి ఇది కనిపిస్తుంది. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌తో మరింత స్పష్టంగా చూడొచ్చు.
జూన్ 25: నక్షత్రాలని తిలకించేందుకు ఉత్తమ సమయం
ఈ రోజు న్యూ మూన్ కారణంగా ఆకాశం చీకటిగా ఉంటుంది. ఇది మిల్కీ వే లాంటి ఆకాశ అందాల్ని చూసేందుకు అద్భుతమైన సమయం.
జూన్ 27: బూటిడ్ ఉల్కాపాతం
ఇది రాత్రి సమయంలో జరిగే ఉల్కావర్షం. మీరు అర్థరాత్రి తర్వాత చూసినట్లయితే పదుల సంఖ్యలో షూటింగ్ స్టార్‌ల ప్రదర్శనను చూడవచ్చు.
జూన్ 30: చంద్రుడు, మంగళం కలయిక
ఈ రోజు చంద్రుడు (వాక్సింగ్ క్రెసెంట్ స్టేజ్‌లో), మంగళగ్రహం ఒకదానికొకటి చాలా దగ్గరగా, సుమారు 1°16' దూరంలో కనిపిస్తాయి. ఈ దూరం మన వేలి పొడవుతో సమానం. బైనాక్యులర్‌తో వీటిని చూడవచ్చు. అలాగే “ఎర్త్‌షైన్” అనే ప్రత్యేక దృశ్యం కూడా ఈ రోజు కనిపించవచ్చు.