Snake Video: వామ్మో..! వందలాది నాగుపాములు ఒకే చోట – వైరల్ అవుతున్న వీడియో

ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని మనందరికీ తెలుసు. వాటిలో కొన్ని మన కళ్లముందు పడినప్పుడు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి అరుదైన దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

Update: 2025-08-17 07:04 GMT

Snake Video: వామ్మో..! వందలాది నాగుపాములు ఒకే చోట – వైరల్ అవుతున్న వీడియో

ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని మనందరికీ తెలుసు. వాటిలో కొన్ని మన కళ్లముందు పడినప్పుడు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి అరుదైన దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక పాముని చూసినా భయపడే వారు ఉంటారు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన వీడియోలో వందలాది నాగుపాములు ఒకే చోట గుమిగూడటం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

ఈ ఘటన ప్రకృతి అందం, తల్లి ప్రేమ, రక్షణ భావాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నది ఒడ్డున పచ్చిక గడ్డిమధ్య వందలాది నాగుపాములు కనిపించాయి. వాటి మధ్య పాము గుడ్లు కూడా ఉన్నాయి. గుడ్లను కాపాడేందుకు అన్ని పాములు ఒక్కచోట చేరినట్లు తెలుస్తోంది. చిన్న పిల్ల పాములతో పాటు, భారీ నాగుపాములు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోను “King Cobra on Duty” అనే శీర్షికతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. పేరుకు తగ్గట్టుగానే, కోబ్రాలు తమ గుడ్లను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ వీడియోలో చూడవచ్చు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన కోబ్రా, తన పిల్లలను కాపాడుకునే క్రమంలో ఎంతటి సాహసానికైనా వెనుకాడదని ఈ దృశ్యం చెబుతోంది.

అయితే, సోషల్ మీడియాలో ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని తల్లి ప్రేమకు అద్భుతమైన ఉదాహరణగా చెబుతుండగా, మరికొందరు ఇది నిజమైన వీడియో కాదని, AI ద్వారా సృష్టించబడినదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Full View


Tags:    

Similar News