Viral Video: వాటర్ ఫాల్స్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ప్రజలు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పాము
Viral Video: ఉత్తరాఖండ్‌లోని ముస్సూరీకి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కేంప్టీ ఫాల్స్‌లో ఊహించని ఓ సంఘటన చోటుచేసుకుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఒక్కసారిగా భయంకరంగా మారిపోయాయి.
Viral Video: వాటర్ ఫాల్స్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ప్రజలు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పాము
Viral Video: ఉత్తరాఖండ్‌లోని ముస్సూరీకి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కేంప్టీ ఫాల్స్‌లో ఊహించని ఓ సంఘటన చోటుచేసుకుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఒక్కసారిగా భయంకరంగా మారిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
జలపాతంలో పెద్ద ఎత్తు ప్రజలు స్నానం చేస్తున్నారు. అదే సమయంలో ఒక పాము నీళ్లలోకి వచ్చి ఆందోళనకు గురి చేసింది. రయ్యి రయ్యిమంటూ దూసుకొస్తూ పర్యాటకులపైకి వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో అరవడం మొదలుపెట్టారు. కొంతమంది వెంటనే నీళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వీడియో చివర్లో అయితే జనాలు గందరగోళంగా పరుగులు పెడుతూ కనిపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందంటూ కొందరు కామెంట్ చేశారు. మొత్తం మీద సరదాగా గడుపుదామని వచ్చిన పర్యాటకులకు పాము షాక్‌కి గురి చేసింది.
కెంప్టీ ఫాల్స్ విశేషాలు ఏంటంటే.?
కేంప్టీ ఫాల్స్ ముస్సూరీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన జలపాతం. ఇక్కడ స్నానం చేయడం, బోటింగ్, కేబుల్ కార్ ప్రయాణం వంటివి ఉంటాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు మంచి వాతావరణం ఉంటుంది. ముస్సూరీ నుంచి ప్రైవేట్ వాహనాలు, టాక్సీలు, బస్సుల ద్వారా ఈ ఫాల్స్‌కు సులభంగా చేరుకోవచ్చు.