Sleep Internship: నిద్రపోయే జాబ్..ఎంపికైతే లక్ష..విన్నరైతే పది లక్షలు!

Wakefit Sleep Internship: రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోవాలి. అలా చేస్తే రూ.10 లక్షలు గెలుచుకోవచ్చు.

Update: 2021-02-24 15:30 GMT

వేక్ఫిట్ (ఫొటో వేక్ ఫిట్ వెబ్ సైట్)

Wakefit Sleep Internship: నిద్ర పోవడమేంటి.. పది లక్షలు గెలవడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! అవునండి..మేం చెప్పేది నిజమే. ఇది నిద్ర పోయే జాబ్. ఈ జాబ్ కు ఎంపికైతే రూ.లక్ష. అదే గెలుపొందితే రూ.పది లక్షలు మీసొంతం అవుతాయి. అలాంటి ఓ మంచి అవకాశమే ఇప్పుడు వచ్చేసింది. ఎక్కడ, ఎలా అప్లయ్ చేయాలో ఈ స్పెషల్ స్టోరీ లో చూద్దాం..

రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోవాలి. అలా చేస్తే రూ.10,00,000 (పది లక్షలు) గెలుచుకోవచ్చు. అబ్బా..ఈ ఉద్యోగం చాలా బాగుంది.. మాకొస్తే ఎగిరి గంతేద్దామనుకుంటున్నారా. అయితే ఇంకెందు ఆలస్యం. వివరాలు తెలుసుకుని అప్లై చేయండి మరి. ఈ కార్యక్రమాన్ని WakeFit అనే సంస్థ అందిస్తుంది. ఇది మ్యాట్రెసెస్ తయారు చేసే స్టార్టప్. వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్స్ రెండో సీజన్ లో 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. గత సీజన్ 2020 లో ఒక బ్యాచ్ విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఈ ఏడాది బ్యాచ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని వడపోసి షార్ట్ లిస్ట్ చేన కొందర్ని స్లీప్ ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వాళ్లు చేయాల్సిన పనేమీ ఉండదు. రోజూ 9 గంటలు నిద్రపోవాలి. అలా 100 రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా రోజూ 9 గంటల చొప్పున నిద్రపోతే బంపర్ ప్రైజ్ వాళ్లదే. ఇంటర్న్‌షిప్ సక్సెస్ పుల్ గా పూర్తి చేసిన వారిని స్లీప్ ఛాంపియన్‌గా గుర్తించి రూ.10 లక్షలు అందిస్తారు. అలానే స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైన ప్రతీ ఒక్కరికి రూ.1,00,000 చొప్పున చెల్లిస్తారు. అంటే స్లీప్ ఇంటర్న్‌గా ఎంపికైతే చాలు రూ. 1 లక్ష రూపాయాలు గ్యారెంటీ.

అర్హతలు, కండీషన్లు

అదే విషయానికి వస్తున్నాం.. ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు ఎవరైనా స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు పంపొచ్చు. కానీ, ఓ కండిషన్ ఉందండోయో..అదేంటంటే.. కేవలం 10 నుంచి 20 నిమిషాల్లో నిద్రపోగలగాలి. అర్ధరాత్రి వరకు మెళకువగా ఉండే అలవాటు ఉండకూడదు. ఎక్కువగా కెఫీన్, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఫిట్‌నెస్ పాటిస్తే మంచిది. నిద్రకు సంబంధించిన టిప్స్ తెలిసి ఉండాలి. ఇలాంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి వేక్‌ఫిట్ మ్యాట్రెస్ (Wakefit Matress) ఇస్తారు. దానిపైనే నిద్రపోవాలి. యాప్ (APP) ద్వారా నిద్ర(Sleep)ను ట్రాక్ చేస్తారు.

ఉద్యోగం ఎక్కడ...

ఈ ఉద్యోగం చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కేవలం మీ ఇంటినుంచే పాల్గొనవచ్చు. అంటే వర్క ఫ్రమ్ హోమ్ (Work From Home) అన్నమాట.

దరఖాస్తు ఎలా...

అంతా బాగానే ఉంది. మరి ఎలా అప్లయ్ చేయాలంటరా..? ఇదిగో https://wakefit.co/sleepintern/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలు పూర్తిగా చదివి అప్లై చేయడం మంచిది. 

Application Link: https://wakefit.co/sleepintern/job-apply

Full View


Tags:    

Similar News